ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం, లెజెండరీ క్రికెటర్ షేన్ వార్న్ అకాల మరణంతో యావత్ క్రికెట్ ప్రపంచం షాక్‌కి గురైంది. ఎంతో చురుగ్గా నవ్వుతూ, నవ్విస్తూ ఉన్న వార్న్, ఇక లేరనే విషయాన్ని చాలామంది ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు... భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, తన సెంచరీతో షేన్ వార్న్‌కి ఘనమైన నివాళి ఘటించాడు...
రవీంద్ర జడేజా, ఐపీఎల్ 2008 ఆరంభ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరుపున ఆడాడు. 2008లో రాజస్థాన్ రాయల్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన షేన్ వార్న్, ఐపీఎల్ టైటిల్ అందించాడు...
28
భారీ అంచనాలతో బరిలో దిగిన సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, యువరాజ్ సింగ్, రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్ ఫెయిల్ అయిన మొదటి సీజన్‌లో టీ20 లీగ్‌ను ఎలా గెలవాలో చేసి చూపించాడు షేన్ వార్న్...
38
అప్పుడప్పుడే క్రికెటర్‌గా ఎదుగుతున్న రవీంద్ర జడేజా, భారత జట్టులో చోటు దక్కించుకోవడానికి, క్రేజ్ సంపాదించుకోవడానికి ఐపీఎల్ పర్ఫామెన్సే కారణం...
48
2008 సీజన్‌లో రవీంద్ర జడేజా ఇచ్చిన పర్ఫామెన్స్‌కి మెచ్చిన షేన్ వార్న్... ‘ఈ కుర్రాడు రాక్ స్టార్...’ అంటూ ప్రశంసించాడు... ఈ విషయాన్ని భారత కామెంటేటర్ హర్షా భోగ్లే మరోసారి గుర్తు చేసుకున్నాడు...
58
దానికి స్పందించిన రవీంద్ర జడేజా.. ‘అవును.. నాకు ఇప్పటికీ ఆయన చెప్పిన మాటలు గుర్తున్నాయి. ఆయన లేరనే వార్త నాకు ఎంతో దు:ఖాన్ని కలిగించింది...’ అంటూ కామెంట్ చేశాడు...
68
షేన్ వార్న్ మరణించిన తర్వాతి రోజే టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసి, తన మొట్టమొదటి ఐపీఎల్ కెప్టెన్‌కి ఘనమైన నివాళి ఘటించాడు జడ్డూ...
78
2018లో వెస్టిండీస్‌పై మొదటి టెస్టు సెంచరీ చేసిన రవీంద్ర జడేజాకి ఇది రెండో టెస్టు సెంచరీ. అలాగే అంతర్జాతీయ క్రికెట్‌లో 5 వేల పరుగులు, 400+ వికెట్లు తీసిన భారత బౌలర్‌గా కపిల్‌దేవ్ తర్వాతి స్థానంలో నిలిచాడు జడ్డూ...
88
2015 నుంచి టెస్టుల్లో ఒకే ఇన్నింగ్స్‌లో 500+ స్కోరు చేయడం భారత జట్టుకి ఇది 16వ సారి. ఆస్ట్రేలియా 15 సార్లు, న్యూజిలాండ్ 14 సార్లు ఈ ఫీట్ సాధించి రెండు, మూడో స్థానాల్లో ఉన్నాయి...