గత కొంతకాలంగా ఉప్పు నిప్పులా ఉంటున్న రవీంద్ర జడేజా-చెన్నై సూపర్ కింగ్స్ ల వ్యవహారం దాదాపు ముగింపునకు చేరుకున్నట్టే కనిపిస్తున్నది. చెన్నైతో తెగదెంపులు చేసుకోవడానికే జడ్డూ చూస్తున్నాడట. ఐపీఎల్-15 ముగిసినప్పట్నుంచి ఆ ఫ్రాంచైజీతో టచ్ లో లేడని, వచ్చే ఏడాది అతడు సీఎస్కేతో ఆడటం కష్టమే అని అతడి సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తున్నది.