2-1 తేడాతో ఇండియాని ఓడిస్తాం, ఐపీఎల్ కాంట్రాక్ట్‌లు కూడా కొట్టేస్తాం... జింబాబ్వే ప్లేయర్ ఇన్నోసెంట్...

First Published Aug 14, 2022, 6:20 PM IST

ఈ ఏడాది ఆరంభంలో సౌతాఫ్రికా టూర్‌లో వన్డే, టెస్టు సిరీస్ ఓడిపోయిన భారత జట్టు... ఆ తర్వాత వరుస విజయాలు అందుకుంటూ దూసుకుపోతోంది. మధ్యలో సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ 2-2 తేడాతో డ్రాగా ముగిస్తే... ఇంగ్లాండ్, ఐర్లాండ్, వెస్టిండీస్, శ్రీలంకలపై టీ20, వన్డే సిరీస్‌లు కైవసం చేసుకుంది...

వరుస విజయాలతో దూసుకుపోతూ ఆసియా కప్ 2022 టోర్నీకి ముందు పసికూనగా మారిన జింబాబ్వేతో వన్డే సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది భారత జట్టు. ఆగస్టు 18 నుంచి ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌కి కెఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు...

2016లో చివరిసారిగా జింబాబ్వేలో పర్యటించిన భారత జట్టు, ఆరేళ్ల తర్వాత మళ్లీ ఇక్కడ పర్యటించనుంది. సీనియర్లు అందరూ రెస్ట్ తీసుకున్న ఈ టూర్‌కి వీవీఎస్ లక్ష్మణ్ హెడ్ కోచ్‌గా వ్యవహరించబోతున్నాడు...
 

Image credit: Getty

మరోవైపు బంగ్లాదేశ్‌పై 2-1 తేడాతో వన్డే సిరీస్ గెలిచిన ఉత్సాహంతో ఉన్న జింబాబ్వే, భారత జట్టుపై కూడా 2-1 తేడాతో సిరీస్ గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. జింబాబ్వే ప్లేయర్ ఇన్నోసెంట్ కియా... టీమిండియా ఓడిస్తామంటూ భరోసా వ్యక్తం చేశాడు...

Image credit: Getty

‘టీమిండియాని 2-1 తేడాతో ఓడించి వన్డే సిరీస్ గెలుస్తాం. నేను సెంచరీ చేయాలని అనుకుంటున్నా. అంతేకాదు, ఈ సిరీస్‌లో నేను టాప్ స్కోరర్‌గా ఉండాలని ఫిక్స్ అయ్యా. ఇప్పటికైతే ఇదే నా లక్ష్యం...

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రిషబ్ పంత్ వంటి ప్లేయర్లు లేకపోవడం జింబాబ్వేకి కలిసి వచ్చే విషయమే. వీళ్లు చాలా సీనియర్లు. జింబాబ్వేను తక్కువ అంచనా వేయొద్దు. వాళ్లను మేం తక్కువగా చూడబోం. అయితే విజయమే లక్ష్యంగా బరిలో దిగుతాం...

ఈసారి మంచి పర్ఫామెన్స్ ఇచ్చి, ఐపీఎల్ కాంట్రాక్ట్‌ పొందాలని అనుకుంటున్నాం. టీమిండియాపై బాగా ఆడితే, ఐపీఎల్‌లో ఛాన్సు దక్కించుకోవడం పెద్ద కష్టమేమీ కాదని మాకు బాగా తెలుసు...’ అంటూ కామెంట్ చేశాడు జింబాబ్వే ప్లేయర్ ఇన్నోసెంట్ కియా...

click me!