రవీంద్ర జడేజాకి ఇంగ్లీష్ రాదు, అది కూడా ఎవరో చెప్పి ఉంటారు.. మరోసారి నోరుపారేసుకున్న సంజయ్ మంజ్రేకర్...

First Published Jun 10, 2021, 9:08 AM IST

రవిచంద్రన్ అశ్విన్ ఆల్‌టైం గ్రేట్ క్రికెటర్ కాడంటూ మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ చేసిన కామెంట్లు... మరింత వివాదానికి దారి తీస్తున్నాయి. కొన్నాళ్లకిందట జడ్డూ గురించి సంజయ్ మంజ్రేకర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు, ఇప్పుడు బయటికి వచ్చాయి. దీంతో మరోసారి మంజ్రేకర్ చిక్కుల్లో ఇరుక్కున్నాడు.

‘‘రవీంద్ర జడేజా ఓ ‘బిట్స్ అండ్ పీస్ ప్లేయర్’ అని, అలాంటి ఆటగాళ్లకు నా జట్టులో ప్లేస్ ఉండదు’’ అంటూ సంజయ్ మంజ్రేకర్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెను దుమారం రేపాయి. ఈ కామెంట్లపై జడ్డూ చాలా సీరియస్‌గా స్పందించాడు కూడా...
undefined
‘సంజయ్ మంజ్రేకర్ నీ నోటిని అదుపులో పెట్టుకో, నువ్వు వెర్బల్ డయేరియాతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది...’ అని చాలా సీరియస్‌గా స్పందించాడు భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా...
undefined
ఈ వివాదం కారణంగానే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 నుంచి వ్యాఖ్యతగా వ్యవహారించే అవకాశాన్ని సంజయ్ మంజ్రేకర్ కోల్పోయాడు. కామెంటేటర్స్ ప్యానెల్ నుంచి సంజయ్ మంజ్రేకర్‌ను తప్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది బీసీసీఐ...
undefined
ఇంత జరిగినా తన నోటిని మాత్రం కంట్రోల్‌లో పెట్టుకోలేకపోతున్నాడు సంజయ్ మంజ్రేకర్. ఆ సంఘటన జరిగిన కొన్నిరోజులకే హార్ధిక్ పాండ్యాను విమర్శిస్తూ అతను కంప్లీట్ ఆల్‌రౌండర్ కాదని కామెంట్ చేసిన మంజ్రేకర్, భారత సీనియర్ స్పిన్నర్ పియూష్ చావ్లాని కూడా విమర్శించాడు...
undefined
రవీంద్ర జడేజాని ‘బిట్స్ అండ్ పీస్ ప్లేయర్’ అంటూ ట్రోల్ చేసిన సమయంలో తనతో సంజయ్ మంజ్రేకర్ చేసిన ట్విట్టర్ ఛాటింగ్‌ను బయటపెట్టాడు ఓ అభిమాని. ఇందులో జడ్డూ గురించి మరిన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు సంజయ్ మంజ్రేకర్.
undefined
‘‘నేను మీ అందరిలా అభిమానిని కాదు, విశ్లేషకుడిని. ప్లేయర్లను, జట్టు ప్రదర్శన విశ్లేషించడమే నా పని.జడేజాకి ఇంగ్లీష్ రాదు. అతనికి నేను ‘బిట్స్ అండ్ పీస్ ప్లేయర్’ అనే మాటకు అర్థం సరిగా తెలియకపోవచ్చు. ఎవరో చెప్పిన మాటలు విని, ఏదేదో ఊహించుకుని ఉన్నాడు. ‘వర్బల్ డయేరియా’ అనే మాటను కూడా ఎవరో చెప్పి ఉంటారు...’’ అంటూ జడ్డూ గురించి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి...
undefined
2019 వన్డే వరల్డ్‌కప్‌లో సంజయ్ మంజ్రేకర్ చేసిన కామెంట్లపై తీవ్రంగా స్పందించిన రవీంద్ర జడేజా, న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అర్ధశతకం పూర్తయిన తర్వాత బ్యాటుని కత్తిలా తిప్పుతూ సెలబ్రేట్ చేసుకున్నాడు.
undefined
‘ఆ సమయంలో అతని కోసం కామెంటరీ బాక్స్‌లో వెతికాను. అతను కనిపించలేదు. ఎక్కడో దాచుకుని ఉంటాడని అనిపించింది...’ అంటూ తన సెలబ్రేషన్స్ వెనకున్న అసలు రహస్యాన్ని బయటపెట్టాడు జడేజా...
undefined
అయితే టీమిండియా ఫ్యాన్స్ మాత్రం సంజయ్ మంజ్రేకర్ కామెంట్లు చేయడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ ఫేవరెట్ క్రికెటర్లను ట్రోల్ చేశాడనే బాధకంటే, మంజ్రేకర్ ట్రోల్ చేసిన ప్రతీసారి ఆ ప్లేయర్ తర్వాతి మ్యాచ్‌లో అదరగొడుతుండడమే దీనికి ప్రధాన కారణం...
undefined
రవీంద్ర జడేజాని బిట్స్ అండ్ పీస్ ప్లేయర్ అని మంజ్రేకర్ చేసిన కామెంట్ల తర్వాత జడ్డూ ఆటతీరు పూర్తిగా మారిపోయింది. ఫీల్డింగ్‌, బౌలింగ్‌లో అదరగొట్టే జడేజా బ్యాటింగ్‌లోనూ మెరుపులు మెరిపిస్తున్నాడు. ఇప్పుడు భారత జట్టులో మ్యాచ్ విన్నర్‌గా మారిపోయాడు.
undefined
హార్ధిక్ పాండ్యా కూడా మంజ్రేకర్ కామెంట్ల తర్వాత ఆడిన సిరీస్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చి... ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు కూడా గెలుచుకున్నాడు.
undefined
ఇప్పుడు రవిచంద్రన్ అశ్విన్‌పై వ్యాఖ్యలు చేయడంతో అతను ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో చెలరేగిపోవాలని కోరుకుంటున్నారు అభిమానులు...
undefined
‘ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో రవిచంద్రన్ అశ్విన్‌కి ఒక్క ఐదు వికెట్ల ప్రదర్శన కూడా లేదని, అదీగాక స్వదేశంలో జరిగిన గత ఇంగ్లాండ్ సిరీస్‌లో అశ్విన్ కంటే అక్షర్ పటేల్ ఎక్కువ వికెట్లు తీశాడని... అందుకే అతన్ని ఆల్‌టైం గ్రేట్ క్రికెటర్‌గా చెప్పాలంటే నాకు కరెక్ట్ అనిపించదని’ కామెంట్లు చేశాడు సంజయ్ మంజ్రేకర్.
undefined
click me!