అశ్విన్‌ ఇంత ఆనందంగా ఎప్పుడూ లేడు... అశ్విన్ సతీమణి ప్రీతి ఉద్వేగభరిత పోస్ట్...

First Published | Dec 30, 2020, 6:48 PM IST

రవిచంద్రన్ అశ్విన్... రెండో టెస్టులో మ్యాచ్ విన్నింగ్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసిన అశ్విన్, రెండో టెస్టులో మొత్తంగా 5 వికెట్లు తీశాడు. బాక్సింగ్ డే టెస్టులో టీమిండియాకి దక్కిన తొలి వికెట్ అశ్విన్ బౌలింగ్‌లోనే. పదో ఓవర్‌లోనే అశ్విన్‌కి బాల్ అందించిన అజింకా రహానే, అదిరిపోయే రిజల్ట్ రాబట్టాడు. బాక్సింగ్ డే టెస్టులో 8 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకున్న టీమిండియా... ఆ సంతోషాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది.

బుమ్రా, జడేజా, ఉమేశ్ యాదవ్, అజింకా రహానే, బుమ్రాలతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసిన రవిచంద్రన్ అశ్విన్... ‘గోడకు అటు తిరిగి ఉన్నప్పుడు, నీ వీపును దానికి ఒరిగించు... ఆ సపోర్టును ఎంజాయ్ చెయ్... జట్టంతా కలిసి అద్భుతంగా ఆడింది. ఇది నూటి నూరు శాతం దక్కిన సంపూర్ణ విజయం...’ అంటూ ట్వీట్ చేశాడు.
మొదటి మ్యాచ్ ఆడుతున్న మహ్మద్ సిరాజ్, శుబ్‌మన్ గిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేనంటూ... వాళ్లని కూడా ట్యాగ్ చేశాడు రవిచంద్రన్ అశ్విన్...

ఈ ఫోటోను రీపోస్టు చేసిన రవిచంద్రన్ అశ్విన్ భార్య ప్రతీ అశ్విన్... తన కళ్లల్లో ఇంత ఆనందం చూసి పదేళ్లు అయ్యిందంటూ కామెంట్ చేసింది...
‘ఎన్నో మ్యాచుల్లో భారత జట్టు విజయాలు అందుకుంది. ప్రతీ టెస్టు మ్యాచ్ తర్వాత నేను అశ్విన్‌తో మాట్లాడుతుంటాను... కానీ ఇంతవరకూ అతను ఇంత సంతోషంగా, సంతృప్తిగా ఉండడం నేనెప్పుడూ చూడలేదు...
అతని నవ్వులో, కళ్లలో ఓ వెలుగు... దాదాపు పదేళ్లలో ఇప్పుడే చూశాను... ’ అంటూ రాసుకొచ్చింది ప్రీతి అశ్విన్.
అశ్విన్ పోస్టు చేసిన ఫోటోపై కామెంట్ చేశాడు భారత క్రికెటర్ రోహిత్ శర్మ... ‘పూజారా ఎందుకంత స్టిఫ్‌గా నిలుచున్నాడంటూ’ అడుగుతూ ట్వీట్ చేశాడు రోహిత్...
అయితే రోహిత్ కామెంట్‌కి తనదైన స్టైల్‌లో ఫన్నీగా రిప్లై ఇచ్చాడు రవిచంద్రన్ అశ్విన్...‘పూజారా బుర్రలో జాతీయ గీతం రన్ అవుతోంది...’ అంటూ రిప్లై ఇచ్చాడు అశ్విన్...
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో హజల్‌వుడ్‌ని క్లీన్‌బౌల్డ్ చేసిన రవిచంద్రన్ అశ్విన్... అత్యధికమంది (192) లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్‌ను అవుట్ చేసిన బౌలర్‌గా ముత్తయ్య మురళీధరన్ రికార్డు (191)ను బద్ధలుకొట్టి, టాప్‌లో నిలిచాడు.
2011, నవంబర్ 13న రవిచంద్రన్ అశ్విన్, ప్రీతిల వివాహం జరిగింది. యూఏఈలో ఐపీఎల్ ముగిసిన తర్వాత కుటుంబంతో సహా ఆస్ట్రేలియాకి వచ్చిన అశ్విన్, క్వారంటైన్‌లో భార్యతో కలిసి మ్యారేజ్ డే సెలబ్రేట్ చేసుకున్నాడు.
రవిచంద్రన్ అశ్విన్, ప్రీతి జోడికి ఆద్య, అకీరా అనే ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు.

Latest Videos

click me!