మాపై గెలవాలంటే అలా ఆడాలి! ఇలా కాదు... ఆస్ట్రేలియా టీమ్‌కి రవిచంద్రన్ అశ్విన్ సలహా...

Published : Feb 26, 2023, 10:03 AM IST

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 సీజన్‌లో రవీంద్ర జడేజా తర్వాత ఆస్ట్రేలియా టీమ్‌ని ముప్పుతిప్పలు పెడుతున్న బౌలర్ రవిచంద్రన్ అశ్విన్.ఈ వెటరన్ స్పిన్నర్ బౌలింగ్‌ ఆడేందుకు టెస్టు నెం.2 బ్యాటర్ స్టీవ్ స్మిత్ తెగ ఇబ్బంది పడుతున్నాడు. అయితే తొలి రెండు టెస్టుల్లో చిత్తుగా ఓడిన ఆస్ట్రేలియాకి ఓ సలహా ఇచ్చి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు రవిచంద్రన్ అశ్విన్..

PREV
15
మాపై గెలవాలంటే అలా ఆడాలి! ఇలా కాదు... ఆస్ట్రేలియా టీమ్‌కి రవిచంద్రన్ అశ్విన్ సలహా...
Image credit: Getty

‘‘నేను చెన్నై వెళ్తున్నప్పుడు ఫ్లైట్‌లో నా పక్కన కూర్చొన్న వ్యక్తి ‘ఎందుకండీ, మీరు టెస్టుని మూడు రోజుల్లోనే ముగించారు. ఐదో రోజు టెస్టు చూడాలని అనుకున్నా. ఇలా మూడు రోజుల్లో ముగించడం మమ్మల్ని తీవ్రంగా నిరాశపరిచింది...’ అని అన్నాడు... అతనికి నేను ఒక్కటే చెప్పా...

25
Ravichandran Ashwin

‘ఈ తరం క్రికెటర్లకు ఓపిక చాలా తక్కువ. గంటలు గంటలు క్రీజులో నిలబడడానికి వాళ్లు ఇష్టపడడం లేదు. వేగంగా పరుగులు చేయాలని అనుకుంటున్నారు. అందుకే ఆటలో వేగం పెరిగింది. తరాలను బట్ట ఆటను పోల్చడం కరెక్ట్ కాదు...

35

అయితే తొలి రెండు టెస్టులు కూడా మూడు రోజుల పాటు సాగలేదు. రెండున్నర రోజుల్లోనే ముగిసి పోయాయి. చివరి రెండు టెస్టులు ఎన్ని రోజులు జరుగుతాయో చెప్పలేం...’ అని చెప్పాను. నిజం చెప్పాలంటే నాగ్‌పూర్‌లో కానీ, ఢిల్లీలో కానీ పిచ్‌ మాకు విపరీతంగా సహకరించలేదు...
 

45
Image credit: PTI

ఆస్ట్రేలియా బ్యాటర్ల టెక్నిక్ లోపం వల్లే వికెట్లు పడ్డాయి. టీ20ల్లో ఫ్రంట్ ఫుట్‌కి వచ్చి షాట్స్ ఆడతారు, టెస్టుల్లో అలా చేయలేకపోయారు. మిగిలిన రెండు టెస్టుల్లో గెలవాలంటే ఆస్ట్రేలియా, టీ20 క్రికెట్‌ని అలవర్చుకుంటే బెటర్.. 
 

55
Image credit: PTI

అయితే ఇలాంటి వికెట్లలో ప్రతీ బంతిని షాట్ ఆడాలనుకోవడం కూడా కరెక్ట్ కాదు, అలా చేస్తే వికెట్ కోల్పోవాల్సి ఉంటుంది. ఎలా బాల్ షాట్ ఆడాలో ఏ బంతిని డిఫెన్స్ ఆడాలో తెలియాలి. పరిస్థితులను గౌరవించాలి, బౌలర్లను గౌరవించాలి.. అప్పుడే పరుగులు చేయొచ్చు...’’ అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్..

click me!

Recommended Stories