పృథ్వీ షా, రిషబ్ పంత్, సూర్య... ఫ్యూచర్ ఐపీఎల్ స్టార్లు వీరే! - సౌరవ్ గంగూలీ...

Published : Feb 26, 2023, 09:45 AM IST

ఐపీఎల్ 2023 సీజన్‌‌కి కౌంట్‌డౌన్ మొదలైంది. మార్చి 31న డిఫెండింగ్ ఛాంపియన్‌‌ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌కి తొలి మ్యాచ్ ఆడనుంది. ఎంఎస్ ధోనీకి ఫేర్‌‌వెల్ సీజన్ కావడంతో 2023 ఐపీఎల్‌కి భారీ హైప్ వచ్చేసింది..

PREV
18
పృథ్వీ షా, రిషబ్ పంత్, సూర్య... ఫ్యూచర్ ఐపీఎల్ స్టార్లు వీరే! - సౌరవ్ గంగూలీ...
Image credit: PTI

బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఐపీఎల్ విషయంలో చాలా కేర్ తీసుకున్నాడు సౌరవ్ గంగూలీ. కరోనాతో ప్రపంచమంతా వణికిపోతున్న సమయంలో ఐపీఎల్ 2020 సీజన్‌ని యూఏఈలో నిర్వహించి సూపర్ సక్సెస్ సాధించాడు గంగూలీ...
 

28

కరోనా సెకండ్ వేవ్‌తో ఐపీఎల్ 2021 సీజన్‌కి మధ్యలో ఆగిపోయినా, దాన్ని రెండు ఫేజ్‌లుగా నిర్వహించాడు సౌరవ్ గంగూలీ. 2022 సీజన్‌లో రెండు అదనపు ఫ్రాంఛైజీలను తీసుకొచ్చిన గంగూలీ, మీడియా హక్కుల విక్రయం ద్వారా రూ.45 వేల కోట్ల ధనాన్ని బీసీసీఐ ఖజానాలో చేర్చాడు...

38
WPL

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌ ఈ ఏడాది ప్రారంభం కానున్నా, దానికి బీజం వేసింది కూడా సౌరవ్ గంగూలీయే. గత ఏడాది బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న గంగూలీ, ఐపీఎల్ ఫ్యూచర్ స్టార్ల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశాడు...

48

‘సూర్యకుమార్ యాదవ్ బెస్ట్ ఇన్ బిజినెస్. అవును, అతను యంగ్ స్టర్ కాదు. 30+ వయసు దాటేశాడు. అయితే కుర్రాళ్ల కంటే సూర్యకుమార్ యాదవ్‌లో కావాల్సినంత టాలెంట్ ఉంది. అతని ఆటను చూసేందుకు జనం ఇష్టపడుతున్నారు. జనానికి ఎలా కావాలో అలాంటి ఆట సూర్య దగ్గర ఉంది...
 

58

పృథ్వీ షాలో టీ20 ఫార్మాట్‌లో మంచి టాలెంట్ ఉంది. ఆ తర్వాత రిషబ్ పంత్ కూడా. ఈ ఇద్దరి వయసు 23 నుంచి 25 ఏళ్ల లోపు వాళ్లే. రిషబ్ పంత్‌కి ప్రపంచవ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఉంది. సూర్య తర్వాత రిషబ్ పంత్‌ నెం.2 అవుతాడు...

68
Image credit: PTI

రుతురాజ్ గైక్వాడ్ కూడా టీ20ల్లో మంచి బ్యాట్స్‌మెన్. అయితే అతను తన ఆటను ఎలా ముందుకు తీసుకెళ్తాడో చూడాలి. ఈ ముగ్గురు బ్యాటర్లు, ఐపీఎల్‌లో ఫ్యూచర్ స్టార్ బ్యాటర్లు. ఉమ్రాన్ మాలిక్ ఫ్యూచర్ స్టార్... 

78
Umran Malik

ఉమ్రాన్ మాలిక్ తన ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెడితే ఐపీఎల్‌లో స్టార్ ప్లేయర్ అవుతాడు. మాలిక్ ఎలా ఆడతాడని జనాలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు...  ’ అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ..

88
shubman gill

ఈ కార్యక్రమంలో పాల్గొన్న హర్భజన్ సింగ్, శుబ్‌మన్ గిల్‌ని కూడా లిస్టులో చేర్చాలని గంగూలీని కోరాడు. ‘అవును.. అతని పేరు నాకు తట్టలేదు. శుబ్‌మన్ గిల్‌ నా లిస్టులో ఐదో ప్లేయర్. పృథ్వీ షా, రిషబ్ పంత్, సూర్య... ఐపీఎల్ ఫ్యూచర్ స్టార్ల లిస్టులో ముందుంటారు. రుతురాజ్ గైక్వాడ్, ఉమ్రాన్ మాలిక్, శుబ్‌మన్ గల్ తర్వాతి ప్లేసుల్లో ఉంటారు...’ అంటూ చెప్పుకొచ్చాడు సౌరవ్ గంగూలీ..  

Read more Photos on
click me!

Recommended Stories