ఇదే ధోనీ సక్సెస్ మంత్ర! 15 మందిని తీసుకుంటే, వాళ్లనే ఏడాదంతా... - రవిచంద్రన్ అశ్విన్

First Published Jun 24, 2023, 12:59 PM IST

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌లో తనకు చోటు దక్కకపోవడాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాడు భారత ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్. టెస్టుల్లో నెం.1 బౌలర్‌గా ఉన్న అశ్విన్, టీమిండియా గురించి, ధోనీ గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు..

‘మార్కస్ లబుషేన్, స్టీవ్ స్మిత్ లాంటి ఆస్ట్రేలియా ప్లేయర్లు, డబ్ల్యూటీసీ ఫైనల్‌కి ముందు కౌంటీ క్రికెట్ ఆడారు. వాళ్లకి అది పెద్ద అడ్వాంటేజ్ అయ్యింది. ఐపీఎల్ తర్వాత టీ20 హ్యాంగోవర్ నుంచి బయటికి వచ్చి టెస్టు ఫైనల్ ఆడడం అంటే అంత తేలికైన విషయం కాదు..

Sachin-Ashwin

గత డబ్ల్యూటీసీ సీజన్‌లో కూడా ఆస్ట్రేలియా ఫైనల్‌కి వచ్చే ఛాన్స్‌ని తృటిలో మిస్ చేసుకుంది. ఇండియాలాగే వాళ్లు కూడా నిలకడగా రాణిస్తున్నారు. గత 10 ఏళ్లలో టీమిండియా, ఒక్క ఐసీసీ టైటిల్ గెలవలేకపోవడం నాకు కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది..

Latest Videos


ఫ్యాన్స్ ఎంతగా ఫీల్ అవుతున్నారో నేను అర్థం చేసుకోగలను. సోషల్ మీడియాలో ఒక్క ప్లేయర్‌ని డ్రాప్ చేయడం వల్లే, లేదా మరో ప్లేయర్‌ని ఆడించడం వల్లే టీమిండియా ఓడిపోయిందనే పోస్టులు, ట్రోలింగ్ చూస్తూనే ఉన్నాను...

ప్లేయర్ క్వాలిటీ ఒక్క మ్యాచ్ డిసైడ్ చేయదు. ఇప్పటికీ మనం ధోనీ కెప్టెన్సీ గురించి, లీడర్‌షిప్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే అతను 15 మందిని సెలక్ట్ చేసుకునేవాడు. బాగా ఆడినా, ఆడకపోయినా ఏడాది మొత్తం ఆ 15 మందే ఉండేవాళ్లు...

ఇలా చేయడం వల్లే ప్లేయర్లలో టీమ్‌లో తమకు విలువ ఉందనే భరోసా వస్తుంది. టీమ్ కోసం ఆడాలనే కసి పెరుగుతుంది. ఇప్పుడు టీమిండియాలో మిస్ అవుతోంది ఇదే..’ అంటూ కామెంట్ చేశాడు రవిచంద్రన్ అశ్విన్.. 

click me!