ప్రాక్టీస్ బాగుంది, పర్ఫామెన్సూ అదిరింది... కౌంటీల్లోనూ తిప్పేసిన అశ్విన్...

First Published Jul 15, 2021, 9:41 AM IST

భారత స్టార్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కి ముందు కౌంటీల్లో పాల్గొని ప్రాక్టీస్ చేయాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రఖ్యాత కౌంటీ క్లబ్ సుర్రే తరుపున కౌంటీ మ్యాచ్‌లో పాల్గొన్న అశ్విన్, బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన సోమర్‌సెట్‌పై అదిరిపోయే పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు.

సుర్రే తరుపున తొలిసారి బరిలో దిగుతున్న రవిచంద్రన్ అశ్విన్‌తో ఓపెనింగ్ ఓవర్ వేయించి, ఘనమైన స్వాగతం పలికింది కౌంటీ క్లబ్. అయితే అశ్విన్ తొలి ఇన్నింగ్స్‌లో పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయాడు.
undefined
మిగలిన బౌలర్ల కంటే ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేసిన రవిచంద్రన్ అశ్విన్, తొలి ఇన్నింగ్స్‌లో 43 ఓవర్లు వేసి, 99 పరుగులిచ్చాడు. కేవలం ఒకే ఒక్క వికెట్ దక్కింది... జోర్డాన్ క్లార్క్, అమర్ వీర్దీ మూడేసి వికెట్లు పడగొట్టడంతో సోమర్ సెట్ 429 పరుగుల భారీ స్కోరు చేసింది...
undefined
సుర్రే 240 పరుగులకే ఆలౌట్ కాగా, రవిచంద్రన్ అశ్విన్ బ్యాటింగ్‌లో మొదటి బంతికే డకౌట్ అయ్యాడు. ఇంగ్లాండ్ స్పిన్నర జాక్ లీచ్ బౌలింగ్‌లో డివాన్ కాన్వేకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు అశ్విన్...
undefined
రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం అశ్విన్ అదిరిపోయే పర్ఫామెన్స్‌తో కమ్‌బ్యాక్ ఇచ్చాడు. డేవిస్ వికెట్ తీసి, సుర్రేకి తొలి బ్రేక్ అందించిన అశ్విన్, 15 ఓవర్లలో 27 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు...
undefined
ఇంగ్లాండ్ బౌలర్ డానియల్ మోరియాటి కూడా 4 వికెట్లు తీయడంతో సోమర్‌సెట్ రెండో ఇన్నింగ్స్‌లో 69 పరుగులకే ఆలౌట్ అయ్యింది... కెప్టెన్ హిల్డరెత్ చేసిన 14 పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోరు.
undefined
నాలుగురోజుల ఈ మ్యాచ్‌లో సుర్రే రెండో ఇన్నింగ్స్‌లో 41 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేయడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన అశ్విన్ రెండు బంతులాడి పరుగులేమీ చేయకుండానే నాటౌట్‌గా నిలిచాడు.
undefined
ఇంగ్లాండ్ టూర్‌లో మిగిలిన క్రికెటర్లు హాలీడేస్ ఎంజాయ్ చేస్తూ, కుటుంబాలతో కలిసి విహారయాత్రలు చేస్తుంటే రవిచంద్రన్ అశ్విన్ మాత్రం కౌంటీల్లో పాల్గొని, టెస్టు సిరీస్‌కి ముందు అవసరమైన ప్రాక్టీస్‌ చేశాడు...
undefined
click me!