Published : Mar 10, 2023, 05:20 PM ISTUpdated : Mar 10, 2023, 05:36 PM IST
అహ్మదాబాద్ వేదికగా ఇండియా- ఆస్ట్రేలియా నాలుగో టెస్టు రికార్డులకు వేదికగా మారింది. రెండు రోజుల్లోనే బోలెడు రికార్డులు నమోదయ్యాయి. కొన్ని టీమిండియాకి అస్సలు మింగుడు పడని రికార్డులైతే, మరికొన్ని భారత జట్టుకి కలిసి వచ్చేవి...
బౌలర్లకు ఏ మాత్రం సహకరించని పిచ్‌పైన రవిచంద్రన్ అశ్విన్, 6 వికెట్లు తీసి అదరగొట్టాడు. రవిచంద్రన్ అశ్విన్‌కి టెస్టుల్లో ఇది 32వ ఐదు వికెట్ల ప్రదర్శన. అనిల్ కుంబ్లే 35 సార్లు ఈ ఫీట్ సాధించి, అశ్విన్ కంటే ముందున్నాడు...
28
Ravichandran Ashwin
అయితే ఇండియాలో అత్యధిక సార్లు ఐదేసి వికెట్లు తీసిన బౌలర్‌గా అనిల్ కుంబ్లే రికార్డును అధిగమించేశాడు రవిచంద్రన్ అశ్విన్. అశ్విన్‌కి ఇండియాలో ఇది 26వ ఫైవ్ వికెట్ హాల్... కుంబ్లే 25 సార్లు ఈ ఫీట్ సాధించాడు.
38
Ashwin
తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు తీసిన అశ్విన్, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఇంతకుముందు అనిల్ కుంబ్లే, ఆస్ట్రేలియాపై 111 వికెట్లు తీయగా... అశ్విన్ ఖాతాలో 113 ఆసీస్ బ్యాటర్ల వికెట్లు చేరాయి.
48
Ravichandran Ashwin
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నాథన్ లియాన్ రికార్డు సమం చేశాడు అశ్విన్... 113 వికెట్లు తీసిన నాథన్ లియాన్, భారత ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్ తీసినా అశ్విన్‌ని వెనక్కి నెట్టేస్తాడు. ఈ టెస్టు మ్యాచ్ ముగిసే సమయానికి ఈ ఇద్దరిలో ఎవరు ఎక్కువ వికెట్లు తీయగలరో వారే టాప్‌లో ఉంటారు..
58
Virat Kohli
34 పరుగులు చేసిన నాథన్ లియాన్ క్యాచ్‌ని అందుకున్న విరాట్ కోహ్లీ, అంతర్జాతీయ క్రికెట్‌లో 300 క్యాచులను అందుకున్నాడు. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తన కెరీర్‌లో 334 క్యాచులు అందుకుని టాప్‌లో ఉన్నాడు. అయితే అత్యంత వేగంగా 300 క్యాచులు అందుకున్న క్రికెటర్‌గా టాప్‌లో నిలిచాడు విరాట్ కోహ్లీ...
68
Image credit: PTI
తొలి ఇన్నింగ్స్‌లో మహ్మద్ షమీ ఏకంగా 31 ఓవర్లు బౌలింగ్ చేశాడు. తన టెస్టు కెరీర్‌లో షమీ ఎప్పుడూ ఇన్ని ఓవర్లు బౌలింగ్ చేసింది లేదు. ఇంతకుముందు 2014లో జరిగిన టెస్టులో 29 ఓవర్లు బౌలింగ్ చేశాడు మహ్మద్ షమీ..
78
Image credit: PTI
ఓపెనర్‌గా క్రీజులోకి వచ్చిన ఉస్మాన్ ఖవాజా, 146.1 ఓవర్‌లో అవుట్ అయ్యాడు. 10 గంటల పాటు బ్యాటింగ్ చేసిన ఉస్మాన్ ఖవాజా... ఇండియాలో 400 బంతులు ఎదుర్కొన్న తొలి ఆసీస్ ప్లేయర్‌గా నిలిచాడు. ఇంతకుముందు 1979లో కోల్‌కత్తా టెస్టులో గ్రాహం ఎల్లోప్ 392 బంతులు ఆడాడు...
88
Usman Khawaja
గత 18 ఏళ్లలో ఓ పర్యాటక జట్టు ఆటగాడు, భారత్‌లో 10 ఓవర్లకు పైగా బ్యాటింగ్ చేయడం ఇదే తొలిసారి. ఇంతకుముందు పాక్ మాజీ క్రికెటర్ యూనిస్ ఖాన్, 2005లో జరిగిన బెంగళూరు టెస్టులో 11 గంటల 30 నిమిషాలు బ్యాటింగ్ చేసి 267 పరుగులు చేశాడు...