ఇక నా వల్ల కాదు, కొత్తవాళ్లను చూసుకోండి... భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి షాకింగ్ నిర్ణయం...

First Published Aug 11, 2021, 12:55 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 తర్వాత టీమిండియాలో సమూలమైన మార్పులు జరిగిలా సంకేతాలు అందుతున్నాయి. భారత ప్రధాన కోచ్ రవిశాస్త్రి కాంట్రాక్ట్ గడువు టీ20 వరల్డ్‌కప్‌ 2021తో ముగియనుంది. అయితే ఆ తర్వాత తిరిగి బాధ్యతలు చేపట్టేందుకు శాస్త్రి సుముఖంగా లేడని టాక్ వినబడుతోంది...

భారత్ వేదికగా జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్ 2021, అక్టోబర్ 17 నుంచి యూఏఈ, ఓమన్ వేదికగా ప్రారంభం కానుంది. ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రికి ఇదే ఆఖరి టోర్నీ కానుంది...

టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రితో పాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్... టీ20 వరల్డ్‌కప్‌ 2021లో భారత బృంద సభ్యులుగా ఉంటారు...

అనిల్ కుంబ్లే, భారత కోచ్ పదవి నుంచి తప్పుకున్న తర్వాత హెడ్‌కోచ్‌గా బాధ్యతలు అందుకున్నాడు రవిశాస్త్రి. రవిశాస్త్రి శిక్షణా సారథ్యంలో 2019 వన్డే వరల్డ్‌కప్‌తో పాటు 2021 వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడింది టీమిండియా...

2019 వన్డే వరల్డ్‌కప్ సెమీస్‌లో టీమిండియా ఓటమి తర్వాత భారత హెడ్ కోచ్ రవిశాస్త్రిపై తీవ్రమైన ట్రోలింగ్ వచ్చింది. అప్పుడే కాదు, టీమిండియా ఎప్పుడు ఓటమి చవి చూసినా ముందుగా ట్రోల్స్ వచ్చేది రవిశాస్త్రిపైనే...

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సపోర్టుతో 2019లో టీమిండియా కోచ్‌గా తిరిగి బాధ్యతలు తీసుకున్నాడు రవిశాస్త్రి.. అయితే మరోసారి ఈ బాధ్యతలు తీసుకోవడానికి రవిశాస్త్రి అండ్ బ్యాచ్ సిద్ధంగా లేదట...

మరో రెండు నెలల్లో టీ20 వరల్డ్‌కప్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత న్యూజిలాండ్‌తో సిరీస్‌ అంటూ వరుస సిరీస్‌లు ఆడనుంది టీమిండియా. అందుకే ఆ సమయానికి కొత్త కోచింగ్ టీమ్‌ను సిద్ధం చేసేలా చర్యలు మొదలెట్టింది బీసీసీఐ...

ఇప్పటికే భారత ప్రధాన కోచ్ రవిశాస్త్రితో పాటు మిగిలిన కోచింగ్ స్టాఫ్‌తో చర్చలు సాగిస్తోంది బీసీసీఐ. ఈ చర్చల్లో రవిశాస్త్రి, కోచ్‌గా మరోసారి కొనసాగేందుకు ఆసక్తి చూపించలేదని సమాచారం...

శ్రీలంక టూర్‌లో భారత జట్టుకి కోచ్‌గా వ్యవహరించిన రాహుల్ ద్రావిడ్, టీమిండియాకి తర్వాతి కోచ్‌గా బాధ్యతలు చేపట్టడం అనివార్యంగా మారనుంది... అయితే రాహుల్ ద్రావిడ్ ఈ బాధ్యతను తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాడా?లేదా? అనే దానిమీదే ఆయన నియామకం ఆధారపడి ఉంది...

భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి శిక్షణలో టీమిండియా రిజర్వు బెంచ్ పటిష్టంగా తయారైంది. ఒకేసారి రెండు భిన్నమైన దేశాలతో రెండు భిన్నమైన టోర్నీలు ఆడిన భారత జట్టు, మూడు జట్లకు కావాల్సినంత మంది ప్లేయర్లను తయారుచేసుకుంది.

అయితే రవిశాస్త్రి హయాంలో టీమిండియా సాధించిన విజయాల్లో ఎక్కువ శాతం క్రెడిట్ రాహుల్ ద్రావిడ్‌కే దక్కింది. ఆస్ట్రేలియా టూర్‌లో 32 ఏళ్లుగా ఆసీస్‌కు ఎదురులేని గబ్బాలో ఆస్ట్రేలియాను చిత్తు చేసి చారిత్రక విజయం సాధించింది భారత జట్టు.

అయితే ఈ జట్టులో శార్దూల్ ఠాకూర్, సిరాజ్, నటరాజన్, వాషింగ్టన్ సుందర్, రిషబ్ పంత్ వంటి కుర్రాళ్లు, రాహుల్ ద్రావిడ్ కోచింగ్‌లో ఆడినవాళ్లు కావడంతో క్రెడిట్ అంతా ఆయనకే వెళ్లింది... ఇలాంటి సంఘటనలతో రవిశాస్త్రి తెగ ఫీలయ్యాడని, అందుకే కోచ్‌గా కొనసాగేందుకు ఆసక్తి చూపించడం లేదని అంటున్నారు ఆయన సన్నిహితులు...

అదీకాకుండా రవిశాస్త్రి కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొన్ని నెలలకే రన్‌ మెషిన్ విరాట్ కోహ్లీ బ్యాటు నుంచి పరుగుల ప్రవాహం ఒక్కసారిగా తగ్గిపోయింది... పూజారా, రహానే వంటి సీనియర్లు పరుగులు చేయలేకపోతున్నారు.  వీరి ఫెయిల్యూర్‌కి కూడా తననే టార్గెట్ చేయడంతో రవిశాస్త్రి, కోచ్ పదవిలో కొనసాగేందుకు ఇష్టపడడం లేదని సమాచారం..

click me!