ఐపీఎల్ 2021 హంగామా మళ్లీ మొదలైంది... చెన్నైకి చేరుకున్న సీఎస్‌కే ప్లేయర్లు...

First Published Aug 11, 2021, 12:05 PM IST

ఐపీఎల్ 2021 హంగామా మళ్లీ మొదలైంది. ఇప్పటికే ఇండియాలో 29 మ్యాచులు ముగించుకున్న 14వ సీజన్, మిగిలిన 31 మ్యాచుల కోసం యూఏఈని వేదికగా ఎంచుకున్న విషయం తెలిసిందే. ఈ సెకండ్ ఫేజ్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ అప్పుడే ప్రాక్టీస్ మొదలెట్టేసింది...

ఐపీఎల్ 2021 సీజన్ కోసం చెన్నైలో చెన్నై సూపర్ కింగ్స్‌ క్యాంపుని ప్రారంభించింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న సీఎస్‌కే ప్లేయర్లు అందరూ చెన్నైలోని ఈ క్యాంపుకి చేరుకున్నారు...

ఇప్పటికే వీరికి కరోనా పరీక్షలు నిర్వహించగా, అందరికీ నెగిటివ్ రిజల్ట్ వచ్చింది. ఆగస్టు 20 వరకూ చెన్నైలోనే ప్రాక్టీస్ చేయనున్నారు సీఎస్‌కే ప్లేయర్లు...

చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టులో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో పాటు సురేష్ రైనా, అంబటి రాయుడు, ఎన్ జగదీశన్, రుతురాజ్ గైక్వాడ్, కృష్ణప్ప గౌతమ్, దీపక్ చాహార్, రాబిన్ ఊతప్ప, కెఎమ్ అసిఫ్... ఈ క్యాంపులో పాల్గొంటున్నారు...

ఆగస్టు 20 వరకూ చెన్నైలో ప్రాక్టీస్ చేసి, ఆ తర్వాత యూఏఈకి పయనమవుతుంది సీఎస్‌కే జట్టు. కరోనా కారణంగా అమలులో ఉన్న ఆంక్షల కారణంగా సీఎస్‌కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమ్మింగ్‌తో మిగిలిన సహాయ సిబ్బంది నేరుగా దుబాయ్ చేరుకుని, జట్టుతో కలుస్తారు..

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్ అనే టాక్ వినబడుతోంది. ధోనీ అభిమానులతో పాటు ఆయన ఆప్తమిత్రుడు సురేష్ రైనా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు..

అయితే ఈ సీజన్‌లో టైటిల్ గెలిచి, ధోనీని మరో సీజన్‌ ఆడేలా ఒప్పిస్తానని కామెంట్ చేశాడు సురేష్ రైనా. గత సీజన్‌లో దారుణమైన పర్ఫామెన్స్ కారణంగా తీవ్రమైన ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు మహేంద్ర సింగ్ ధోనీ...

యూఏఈలో జరిగిన ఐపీఎల్ 2020లో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్, ఈ సీజన్‌లో టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇచ్చింది...

కరోనా కారణంగా సీజన్‌కి బ్రేకులు పడే సమయానికి మొదటి ఏడు మ్యాచుల్లో ఐదింట్లో గెలిచి, పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది...

సీఎస్‌కే విజయాల్లో కీలక పాత్ర పోషించిన రవీంద్ర జడేజాతో పాటు సామ్ కుర్రాన్, మొయిన్ ఆలీ... ప్రస్తుతం ఇండియా, ఇంగ్లాండ్ సిరీస్‌లో పాల్గొంటున్నారు... వీరంతా నేరుగా ఇంగ్లాండ్ నుంచి యూఏఈ చేరనున్నారు..

ఇండియా, ఇంగ్లాండ్ మధ్య టెస్టు సిరీస్ సెప్టెంబర్ 14న ముగుస్తుంటే, సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ సీజన్ తిరిగి ప్రారంభం కానుంది... సీజన్ రీలాంఛ్‌లో మొదటి మ్యాచ్‌ సీఎస్‌కే, ముంబై మధ్య జరగనుంది...

అయితే బయో బబుల్ టూ బయో బబుల్ ట్రాన్స్‌ఫర్‌కి బీససీఐ అనుమతినిచ్చింది. దీంతో నేరుగా ఇంగ్లాండ్ నుంచి ఎలాంటి క్వారంటైన్ అవసరం లేకుండానే ఐపీఎల్ జట్లతో కలవబోతున్నారు క్రికెటర్లు...

click me!