జైపూర్‌లో భారీ క్రికెట్ స్టేడియం, ప్రపంచంలోనే మూడోది... రాజస్థాన్‌కి బీసీసీఐ నూరు కోట్ల సాయం...

First Published Jul 4, 2021, 10:27 AM IST

దేశంలో క్రికెట్ క్రేజ్‌కి తగ్గట్టుగా స్టేడియాల నిర్మాణాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం మొతేరాను అహ్మదాబాద్‌లో నిర్మించగా, ఇప్పుడు దాని పక్కనే ఉన్న రాజస్థాన్‌లో మరో భారీ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి...

ఐపీఎల్‌లో రాజస్థాన్ రాష్ట్రానికి రిప్రెజెంట్ చేసే రాజస్థాన్ రాయల్స్ జట్టుకి జైపూర్‌లోని స్వరాజ్ మాన్‌సింగ్ క్రికెట్ స్టేడియం, హోం గ్రౌండ్‌గా ఉంది. అయితే ఈ స్టేడియం పూర్తి కెపాసిటీ 30 వేలు మాత్రమే...
undefined
దీంతో దానికి రెట్టింపు సిట్టింగ్ కెపాసిటీతో 75 వేల మంది ప్రేక్షకులు కూర్చొని మ్యాచ్ చూసేలా... ప్రపంచంలోనే మూడో అతి పెద్ద క్రికెట్ స్టేడియాన్ని నిర్మించేందుకు రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ ఏర్పాట్లు చేసింది...
undefined
అహ్మదాబాద్‌లోని మొతేరా నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం, ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ తర్వాత మూడో అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా ఈ క్రికెట్ గ్రౌండ్ నిలవనుంది...
undefined
ఈ స్టేడియం నిర్మాణానికి దాదాపు రూ.350 కోట్ల దాకా ఖర్చు అవుతుందని రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ అంచనా వేస్తోంది.ఇందులో రూ.100 కోట్ల రూపాయలను బీసీసీఐ అందిస్తోంది...
undefined
స్టేడియం నిర్మాణానికి ఇప్పటికే 100 ఎకరాల స్థలాన్ని లీజులకి తీసుకున్న క్రికెట్ బోర్డు, జైపూర్ నగర శివారులోని చోప్ అనే గ్రామంలో ఏర్పాటు చేసేందుకు స్థలాన్ని పరిశీలించడం కడా జరిగింది...
undefined
అత్యాధునిక సౌకర్యాలతో కూడిన క్రికెట్ స్టేడియంతో ఐపీఎల్ మ్యాచులు, అంతర్జాతీయ మ్యాచులు జరిగినప్పుడు ఇక్కడికి వచ్చే క్రికెటర్లు, సెలబ్రిటీల కూడా వరల్డ్ క్లాస్ వసతి ఏర్పాట్లన్నీ ఇందులోనే నిర్మించబోతున్నారు...
undefined
భారీ పార్కింగ్ ప్లేస్, క్లబ్ హౌస్, ప్రాక్టీస్ గ్రౌండ్స్‌తో పాటు ఇండోర్ గేమ్స్ ఆడుకునేందుకు కూడా ఈ స్టేడియంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయబోతోంది రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్...
undefined
వచ్చే నెలలో నిర్మాణ పనులు ప్రారంభించి, 2024 నాటికి స్టేడియాన్ని అందుబాటులోకి తీసుకురావాలని చూస్తోంది రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్...
undefined
click me!