రాహుల్ ద్రావిడ్ టెంపరరీ కోచ్ కాదు, రవిశాస్త్రి తర్వాత కోచ్ ఆయనే... మాజీ క్రికెటర్ కామెంట్...

Published : Jul 01, 2021, 04:16 PM IST

శ్రీలంక టూర్‌కి కోచ్‌గా ఎంపికయ్యాడు మాజీ క్రికెటర్, అండర్19 కోచ్ రాహుల్ ద్రావిడ్. కేవలం లంక టూర్‌ వరకూ రాహుల్ ద్రావిడ్ కోచ్‌గా వ్యవహరించబోతున్నాడనేది వాస్తవం కాదని, ఇది కేవలం ప్రాక్టీకల్స్ మాత్రమేనని అంటున్నాడు మాజీ క్రికెటర్, ఆల్‌రౌండర్ రితిందర్ సింగ్ సోదీ..

PREV
110
రాహుల్ ద్రావిడ్ టెంపరరీ కోచ్ కాదు, రవిశాస్త్రి తర్వాత కోచ్ ఆయనే... మాజీ క్రికెటర్ కామెంట్...

భారత జట్టు హెడ్ కోచ్ రవిశాస్త్రి, ప్రస్తుతం విరాట్ సేనతో కలిసి ఇంగ్లాండ్ టూర్‌లో హాలీడేస్ ఎంజాయ్ చేస్తూ బిజీగా ఉండడంతో... రాహుల్ ద్రావిడ్, ధావన్ అండ్ టీమ్‌కి కోచ్‌గా వ్యవహారించనున్నాడు. 

210

జూన్ 13 నుంచి మొదలయ్యే ఈ సిరీస్‌లో శిఖర్ ధావన్ కెప్టెన్సీలోని భారత జట్టు, శ్రీలంకతో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచుల సిరీస్‌ ఆడబోతోంది...   

310

2014 ఇంగ్లాండ్ పర్యటనలో భారత జట్టుకి బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా వ్యవహరించిన రాహుల్ ద్రావిడ్, ఆ తర్వాత ఇండియా ఏ, అండర్19 జట్లకి కోచ్‌గా వ్యవహరించాడు...

410

ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) డైరెక్టర్‌గా వ్యవహారిస్తున్న రాహుల్ ద్రావిడ్, త్వరలో భారత జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు తీసుకోబోతున్నట్టు ప్రకటించాడు మాజీ క్రికెటర్ రితిందర్ సింగ్ సోదీ...

510

‘కోచ్‌గా రాహుల్ ద్రావిడ్, ఇప్పటికే అద్భుతాలు చేయగలనని నిరూపించుకున్నాడు. రవిశాస్త్రి కోచ్‌గా భారత జట్టుకి ఎన్నో విజయాలు అందించాడు. అయితే అతని కాంట్రాక్ట్ త్వరలోనే ముగియనుంది...

610

అందుకే రాహుల్ ద్రావిడ్‌ని లంక టూర్‌కి కోచ్‌గా చేయడం కేవలం టెంపరరీ అరేంజ్‌మెంట్ కాదని నేను అనుకుంటున్నా. శ్రీలంక టూర్‌కి రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్‌గా వ్యవహారించబోతున్నాడంటే, త్వరలోనే భారత జట్టుకి హెడ్ కోచ్‌ కాబోతున్నాడని హింట్ ఇస్తున్నట్టే...

710

రవిశాస్త్రి స్థానాన్ని భర్తీ చేయగల సామర్థ్యం ఉన్న కోచ్ ఎవరైనా ఉన్నారంటే... అది కచ్ఛితంగా రాహుల్ ద్రావిడే... ’ అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్ రితిందర్ సింగ్ సోదీ...

810

మహ్మద్ కైఫ్ కెప్టెన్సీలో 2000లో అండర్19 వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో సభ్యుడైన రితిందర్ సింగ్ సోదీ, టీమిండియా తరుపున రాహుల్ ద్రావిడ్‌తో కలిసి 18 వన్డే మ్యాచులు ఆడాడు...

910

2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత జట్టు పరాజయం తర్వాత హెడ్‌కోచ్ అనిల్ కుంబ్లే... అర్ధాంతరంగా ఆ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత రాహుల్ ద్రావిడ్‌కి టీమిండియా ప్రధాన కోచ్ పదవిని ఆఫర్ చేసింది బీసీసీఐ.

1010

అయితే అనిల్ కుంబ్లేకి జరిగిన అవమానాన్ని, పరాభవాన్ని ప్రత్యక్షంగా చూసిన రాహుల్ ద్రావిడ్, భారత జట్టు కోచ్‌గా బాధ్యతలు స్వీకరించేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు... 

click me!

Recommended Stories