మొన్న ఏబీ డివిల్లియర్స్, నిన్న డుప్లిసిస్, నేడు క్వింటన్ డి కాక్... సౌతాఫ్రికాకి వరుస షాక్‌లు...

First Published Dec 31, 2021, 9:42 AM IST

సౌతాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డి కాక్ అర్ధాంతరంగా టెస్టు క్రికెట్ ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి అందర్నీ షాక్‌కి గురి చేశాడు. టీమిండియాతో జరిగిన తొలి టెస్టు తర్వాత డి కాక్ ఈ నిర్ణయం తీసుకోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది...

క్రికెట్ టీమ్‌లో చోటు దక్కించుకోవడం ఎంత కష్టమో, దాన్ని కాపాడుకోవడం అంతకంటే కష్టం. అయితే సౌతాఫ్రికా క్రికెట్ టీమ్‌లో మాత్రం ముగ్గురు స్టార్ క్రికెటర్లు... కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు అర్ధాంతరంగా రిటైర్మెంట్ ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు...

29 ఏళ్ల క్వింటన్ డి కాక్, తన భార్య ప్రసవం కోసం టీమిండియాతో జరిగే రెండు, మూడో టెస్టులకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాడు. పెటర్నిటీ లీవ్ ద్వారా డి కాకక్ దూరంగా ఉంటాడని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు ముందుగానే ప్రకటించింది. 

 అయితే సెంచూరియన్ టెస్టు ముగిసిన తర్వాత కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేందుకు టెస్టు ఫార్మాట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు డి కాక్...

54 టెస్టుల్లో 38.38 సగటుతో 6 సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలతో 3,300 పరుగులు చేసిన క్వింటన్ డి కాక్, వికెట్ కీపర్‌గా 221 క్యాచులు, 11 స్టంపౌట్లు చేశాడు...

టెస్టు ఫార్మాట్ నుంచి తప్పుకున్నా, వన్డే, టీ20 ఫార్మాట్‌లో కొనసాగుతానని, జట్టుకి అందుబాటులో ఉంటానని ప్రకటించాడు క్వింటన్ డి కాక్...

ఈ ఏడాది ఆరంభంలో ఫ్రిబవరి 2021లో సౌతాఫ్రికా మాజీ కెప్టెన్, స్టార్ ఓపెనర్ ఫాఫ్ డుప్లిసిస్ కూడా టెస్టు క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు...

37 ఏళ్ల డుప్లిసిస్, టెస్టుల నుంచి తప్పుకుని టీ20 వరల్డ్‌కప్, వన్డే వరల్డ్‌కప్ టోర్నీల్లో జట్టుకి అందుబాటులో ఉండాలని నిర్ణయించుకున్నాడు. అయితే 2021 టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో డుప్లిసిస్‌కి చోటు దక్కలేదు...

అంతకుముందు సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్ ఏబీ డివిల్లియర్స్ కూడా ఇలా అర్ధాంతరంగా తప్పుకుంటున్నట్టు ప్రకటించి, సౌతాఫ్రికా క్రికెట్ బోర్డుతో పాటు క్రికెట్ ఫ్యాన్స్‌ని షాక్‌కి గురి చేశాడు...

114 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ20 మ్యాచులు ఆడి దాదాపు 20 వేలకు పైగా పరుగులు చేసిన ఏబీ డివిల్లియర్స్, 2019 వన్డే వరల్డ్‌కప్ టోర్నీకి ముందు మే 2018లో అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించాడు...

ఏబీ డివిల్లియర్స్ సడెన్ రిటైర్మెంట్‌ షాక్ నుంచి కోలుకోవడానికి సౌతాఫ్రికా క్రికెట్ జట్టుకి చాలా సమయమే పట్టింది. 2019 వన్డే వరల్డ్‌ కప్ టోర్నీలో పేలవమైన ప్రదర్శన ఇచ్చిన సఫారీ జట్టు, 2021 టీ20 వరల్డ్‌ కప్ టోర్నీలో బెటర్ పర్ఫామెన్స్ ఇచ్చింది...

ఇప్పుడిప్పుడే అరకొర విజయాలతో మళ్లీ పూర్వ ఫామ్‌ను అందుకునేందుకు ప్రయత్నించిన సౌతాఫ్రికా జట్టుకి క్వింటన్ డి కాక్ రిటైర్మెంట్ నిర్ణయం ఎలా ఎఫెక్ట్ ఇస్తుందో చూడాలి...

click me!