రాహుల్, మయాంక్, క్రిస్ గేల్, మహ్మద్ షమీ... ఎవ్వరూ వద్దు, అందరూ వేలానికే... పంజాబ్ కింగ్స్ సంచలన నిర్ణయం...

First Published Nov 27, 2021, 2:00 PM IST

ఐపీఎల్ చరిత్రలో ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయిన జట్లలో పంజాబ్ కింగ్స్ ఒకటి. ఫ్రాంఛైజీ పేరు మార్చినా, జెర్సీ రంగు మార్చినా, కెప్టెన్‌, లోగో... ఇలా ఎన్ని మార్చినా పంజాబ్‌కి లక్ మాత్రం కలిసి రాలేదు...

ఐపీఎల్ 2020, ఐపీఎల్ 2021 సీజన్లలో కెఎల్ రాహుల్ కెప్టెన్సీలో పంజాబ్ కింగ్స్ ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. లీగ్ స్టేజ్‌లో 8 పరాజయాలు, ఆరు విజయాలతో రెండు సీజన్లలోనూ ప్లేఆఫ్స్‌కి చేరలేకపోయింది...

గత రెండు సీజన్లలోనూ 600+ పరుగులు చేసిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కెఎల్ రాహుల్, 2020 సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ అయితే గెలవగలిగాడు కానీ జట్టుకి విజయాలు మాత్రం అందించలేకపోయాడు...

2008లో ప్లేఆఫ్స్ చేరిన పంజాబ్ కింగ్స్, 2014లో ఫైనల్‌కి దూసుకెళ్లి, రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఈ రెండూ మినహా మిగిలిన అన్ని సీజన్లలోనూ టాప్ 4లో కూడా నిలవలేకపోయిన ప్రీతి జింటా టీమ్, గత మూడు సీజన్లలో ఆరో స్థానంతో సరిపెట్టుకుంది...

చేతుల దాకా వచ్చిన మ్యాచ్‌ను, విజయం అంచుల దాకా వచ్చిన గేమ్‌ను చేజేతులా ఓడడంలో పంజాబ్ కింగ్స్‌కి మించిన టీమ్‌ మరోటి లేదని ఐపీఎల్ ఫ్యాన్స్ అభిప్రాయం...

‘యూనివర్సల్ బాస్’ క్రిస్ గేల్‌తో పాటు అయిడెన్ మార్క్‌రమ్, మార్కస్ హెండ్రిక్స్, జో రిచర్డ్‌సన్, నికోలస్ పూరన్, క్రిస్ జోర్డాన్, డేవిడ్ మలాన్, రిలే మెడెరిత్, అదిల్ రషీద్ వంటి ఫారిన్ స్టార్లు పంజాబ్ కింగ్స్ జట్టులో ఉన్నారు...

వీరితో పాటు కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, సర్ఫరాజ్ ఖాన్, దీపక్ హుడా, మహ్మద్ షమీ వంటి ఇండియన్ స్టార్ ప్లేయర్లు కూడా పంజాబ్ కింగ్స్ జట్టులో భాగంగా ఉన్నారు...

వీరితో పాటు యంగ్ బౌలర్లు అర్ష్‌దీప్ సింగ్, రవిభిష్ణోయ్, మురుగన్ అశ్విన్, ఆల్‌రౌండర్ షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బార్, మన్‌దీప్ సింగ్ వంటి ప్లేయర్లు కూడా పంజాబ్ కింగ్స్ జట్టు తరుపున 2021 సీజన్‌లో ఆడారు...

అయితే టీమ్ పర్పామెన్స్‌తో ఏ మాత్రం సంతృప్తి చెందని మేనేజ్‌మెంట్, ఏ ప్లేయర్‌ని రిటైన్ చేసుకోవడానికి ఇష్టపడడం లేదని సమాచారం. క్యాప్‌డ్, అన్‌క్యాప్‌డ్ అనే సంబంధం లేకుండా పూర్తిగా కొత్త జట్టుతో వచ్చే సీజన్‌లో బరిలో దిగాలని చూస్తోంది...

ఇప్పటికే పంజాబ్ కింగ్స్ టీమ్ వీకిపీడియాలో ప్లేయర్లకు సంబంధించిన వివరాలను తొలగించేశారు. వచ్చే సీజన్‌లో అయినా పంజాబ్ రాత మార్చే ప్లేయర్లతో బరిలో దిగాలని చూస్తోంది టీమ్ మేనేజ్‌మెంట్...

శ్రేయాస్ అయ్యర్‌తో పాటు శిఖర్ ధావన్, డేవిడ్ వార్నర్, హార్ధిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, ట్రెంట్ బౌల్ట్, మొయిన్ ఆలీ, సామ్ కుర్రాన్ వంటి స్టార్లు వచ్చే మెగా వేలంలోకి రానున్నారు...

పూర్తి పర్సుతో వేలానికి వెళ్లి,  శ్రేయాస్ అయ్యర్, డేవిడ్ వార్నర్‌ వంటి స్టార్‌ను కొనుగోలు చేసి, జట్టును కొత్తగా నిర్మించాలని ప్రీతి జింటా టీమ్ భావిస్తున్నట్టు సమాచారం... 

click me!