అతని బ్యాటింగ్ బాగుంది, మరి బౌలింగ్ సంగతేంటి... రవీంద్ర జడేజాపై కపిల్‌దేవ్ కామెంట్స్...

First Published Nov 27, 2021, 1:02 PM IST

టీమిండియాలో మూడు ఫార్మాట్లలోనూ కీలకంగా మారిన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా వన్డే, టీ20, టెస్టుల్లో ఆల్‌రౌండర్‌గా చోటు దక్కించుకున్న జడ్డూ.. ఆల్‌రౌండ్ షో మాత్రం ఇవ్వలేకపోతున్నాడు...

కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో హాఫ్ సెంచరీ చేసిన రవీంద్ర జడేజా, గత రెండేళ్లుగా విరాట్ కోహ్లీ కంటే మెరుగైన సగటుతో పరుగులు చేస్తున్నాడు...

టెస్టుల్లో ఆరో స్థానంలో 81.8 సగటుతో బ్యాటింగ్ చేసిన జడేజా, 2019 నుంచి 43.94 సగటుతో టెస్టుల్లో పరుగులు చేసి రోహిత్ శర్మ (58.48) తర్వాతి స్థానంలో నిలిచాడు...

స్వదేశంలో జరిగిన గత ఐదు ఇన్నింగ్స్‌ల్లో నాలుగు సార్లు హాఫ్ సెంచరీ మార్కు దాటిన రవీంద్ర జడేజా, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక యావరేజ్ కలిగిన భారత బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ తర్వాత స్థానంలో నిలిచాడు.

అయితే బౌలింగ్‌లో మాత్రం రవీంద్ర జడేజా మెరుపులు చూసి చాలా రోజులే అవుతోంది. అటు రవిచంద్రన్ అశ్విన్ బంతితో, బ్యాటుతో రాణిస్తూ పర్ఫెక్ట్ ఆల్‌రౌండర్‌గా ఎదిగితే, జడ్డూ మాత్రం కేవలం బౌలింగ్‌లోనే మెరుపులు చూపిస్తున్నాడు...

‘రవీంద్ర జడేజా కెరీర్ మొదలెట్టినప్పుడు చాలా మంచి బౌలర్. అయితే ఇప్పుడు అతను చాలా మంచి బ్యాట్స్‌మెన్‌గా మారాడు. అవసరమైనప్పుడు బ్యాటుతో రాణించి పరుగులు చేస్తున్నాడు...

అయితే బౌలింగ్‌లో మాత్రం వికెట్లు తీయలేకపోతున్నాడు. పర్ఫెక్ట్ ఆల్‌రౌండర్‌ అనిపించుకోవాలంటే బౌలింగ్ చేస్తే సరిపోదు, వికెట్లు కూడా తీయగలగాలి...’ అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్ కపిల్‌దేవ్...

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన రవీంద్ర జడేజా... ఆ తర్వాత ఇంగ్లాండ్‌ టూర్‌లో నాలుగు టెస్టుల్లోనూ చోటు దక్కించుకున్నాడు...

బ్యాటుతో రాణించినా... నాలుగు టెస్టుల్లో 8 ఇన్నింగ్స్‌ల్లో కలిపి జడేజా తీసిన వికెట్లు మూడంటే మూడు. టీ20 వరల్డ్‌కప్ టోర్నీలోనూ జడ్డూ నుంచి సరైన పర్ఫామెన్స్ రాలేదు...

click me!