ఏడేళ్ల పాటు పక్కన కూర్చోబెట్టారు... బీసీసీఐ టీమ్ మేనేజ్‌మెంట్‌పై యువరాజ్ సింగ్ కామెంట్...

First Published May 22, 2021, 3:31 PM IST

యువరాజ్ సింగ్ పేరు చెప్పగానే ఒకే ఓవర్‌లో ఆరుకి ఆరు బంతులను సిక్సర్లుగా మలిచిన 2007 టీ20 వరల్డ్‌కప్ ఇన్నింగ్స్‌ గుర్తుకు వస్తుంది చాలామందికి. అయిత యువీ తన క్రికెటింగ్ కెరీర్‌లో అంతకి మించిన అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. 

క్యాన్సర్‌తో బాధపడుతూ రక్తపు వాంతులు చేసుకున్నా, బ్యాటింగ్ కొనసాగించి... ఆఖరి దాకా ఓటమిని ఒప్పుకోవడానికి ఇష్టపడని మొండి క్రికెటర్ యువరాజ్ సింగ్. అయితే యువీ టెస్టు కెరీర్ మాత్రం ఆశించినంత సక్సెస్‌ఫుల్‌గా సాగలేదు.
undefined
తన 17 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో 304 వన్డేలు, 58 టీ20 మ్యాచులు ఆడిన యువరాజ్ సింగ్, టెస్టులు ఆడింది మాత్రం 40 మ్యాచులే. 40 టెస్టుల్లో 1900 పరుగులు చేసిన యువరాజ్ సింగ్, 9 వికెట్లు పడగొట్టాడు.
undefined
తన టెస్టు కెరీర్‌ గణాంకాలపై యువరాజ్ సింగ్ ఏ మాత్రం సంతోషంగా లేనట్టు తాజాగా చేసిన ట్వీట్ ద్వారా తెలుస్తోంది. విజ్డెన్ ఇండియా వెబ్‌సైట్, ఏ భారత మాజీ క్రికెటర్ మరిన్ని టెస్టులు ఆడి ఉంటే బాగుండేది? అంటూ యువీ ఫోటోను ట్వీట్ చేసింది.
undefined
ఈ ట్వీట్‌పై స్పందించిన యువరాజ్ సింగ్... ‘బహుశా వచ్చే జన్మలో... ఎప్పుడైతే ఏడేళ్ల పాటు నేను టీమ్‌లో 12వ ప్లేయర్‌గా ఉండనో అప్పుడు...’ అంటూ కామెంట్ చేశాడు. ఫన్నీగా చేసినట్టు ఉన్నా, యువీ కామెంట్‌లో వ్యంగ్యం స్పష్టంగా కనిపిస్తోంది.
undefined
2000 సంవత్సరంలో కెన్యాతో జరిగిన మ్యాచ్‌లో తొలి వన్డే ఆడిన యువరాజ్ సింగ్, 2003లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టెస్టు ఆరంగ్రేటం చేశాడు. దాదాపు మూడేళ్ల పాటు తుదిజట్టులో ప్లేస్ కోసం యువీ ఎదురుచూడాల్సి వచ్చింది.
undefined
న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు సిరీస్‌లో 7 మ్యాచుల్లో కలిపి కేవలం 113 పరుగులే చేశాడు యువరాజ్. అత్యధిక స్కోరు 44 పరుగులే. అయితే వన్డేల్లో మాత్రం అప్పటికే సెంచరీలతో చెలరేగడంతో తుదిజట్టులో కొనసాగుతూ వచ్చాడు.
undefined
2004లో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో 59 పరుగులు చేసి తొలి టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదుచేసిన యువీ, ఆ తర్వాత రెండో టెస్టులో సెంచరీ కూడా బాదాడు. ఆసీస్ టూర్‌లో రాణించినప్పటికీ అతన్ని టెస్టు టీమ్ నుంచి తప్పించింది బీసీసీఐ...
undefined
జూన్ 30, 2017లో వెస్టిండీస్‌పై తన చివరి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ ఆడిన యువరాజ్ సింగ్, 2019 జూన్ 10న రిటైర్మెంట్ ప్రకటించాడు.
undefined
2021 ఆరంభంలో కమ్‌బ్యాక్ ఇవ్వాలని భావించినా, విదేశీ లీగ్‌లో పాల్గొనడంతో యువీ రీఎంట్రీకి పంజాబ్ క్రికెట్ అసోసియేషన్, బీసీసీఐ అంగీకరించలేదు.
undefined
click me!