ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 42 బంతులు ఆడిన ఏబీ డివిల్లియర్స్, 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 75 పరుగులు చేసి రాయల్ ఛాలెంజర్స్‌ను ఆదుకున్నాడు. ఏబీడీ బాదిన సిక్సర్లతో మూడు సిక్సర్లు ఆఖరి ఓవర్‌లోనే రావడం విశేషం...
‘రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఏబీ డివిల్లియర్స్ చాలా ముఖ్యమైన ప్లేయర్. జట్టు ఎప్పుడు ఆపదలో ఉన్నా, అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆదుకోవడం ఏబీడీకి అలవాటు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లోనూ ఏబీడీ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.
స్టోయినిస్ బౌలింగ్‌లో అతను కొట్టిన సిక్సర్లు, మ్యాచ్‌కే హైలెట్... అతనో జీనియస్ ప్లేయర్, చాలా ఇంటెలిజెంట్‌గా బౌలర్ ఎలాంటి బంతి వేయబోతున్నాడో ముందుగానే పసిగడతాడు.
బౌలర్ వేసే బంతికి తగ్గట్టుగా షాట్స్ ఆడతాడు. అందుకే అతను బ్యాటింగ్ చేస్తుంటే ఎవ్వరైనా అలా చూస్తుండిపోవాల్సిందే... నాకు తెలిసి విరాట్ కోహ్లీ బదులుగా ఏబీ డివిల్లియర్స్ ఓపెనర్‌గా వస్తే బాగుంటుంది.
దేవ్‌దత్ పడిక్కల్ చాలా దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అతనికి తోడుగా ఏబీ డివిల్లియర్స్ ఉంటే, అతని బ్యాటింగ్ విన్యాసాన్ని 20 ఓవర్ల పాటు చూసే అదృష్టం క్రికెట్ ఫ్యాన్స్‌కి దక్కుతుంది...
విరాట్ కోహ్లీ ఎలాగూ సెటిల్ అవ్వడానికి కాస్త సమయం తీసుకుంటాడు. కాబట్టి కోహ్లీ బ్యాటింగ్ ఆర్డర్‌లో కిందకి వెళ్లి, ఏబీ డివిల్లియర్స్‌ను పైకి పంపే ఆలోచన చేస్తే బాగుంటుంది’ అంటూ కామెంట్ చేశాడు సునీల్ గవాస్కర్...
ఐపీఎల్‌లో 5 వేల పరుగులు పూర్తిచేసుకున్న రెండో ఫారిన్ ప్లేయర్‌గా నిలిచిన ఏబీ డివిల్లియర్స్, అతి తక్కువ బంతుల్లో ఈ ఫీట్ సాధించిన మొదటి ప్లేయర్‌గా నిలిచాడు. ఏబీడీ 3288 బంతుల్లో 5 వేల పరుగుల మైలురాయి అందుకుంటే, డేవిడ్ వార్నర్ 5390 బంతులు వాడుకున్నాడు.