కోహ్లీ లాంటి ప్లేయర్, తరానికి ఒక్కడే పుడతాడు... విరాట్‌కి వీరాభిమానినంటున్న బ్రెట్ లీ...

Published : Sep 17, 2022, 01:20 PM IST

క్రికెటర్లకు అభిమానులు ఉంటారు. లెజెండరీ క్రికెటర్లకు వీరాభిమానులు ఉంటారు. అయితే తనతో ఆటతో లెజెండరీ క్రికెటర్లనే తన అభిమానులుగా మార్చుకున్న ప్లేయర్లు మాత్రం చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు. అలాంటి వారిలో విరాట్ కోహ్లీ ఒకడు. విరాట్ ఆటకు దిగ్గజ క్రికెటర్లు అభిమానులుగా మారిపోయారు. ఇప్పుడు ఈ లిస్టులో బ్రెట్ లీ కూడా చేరిపోయాడు...

PREV
16
కోహ్లీ లాంటి ప్లేయర్, తరానికి ఒక్కడే పుడతాడు... విరాట్‌కి వీరాభిమానినంటున్న బ్రెట్ లీ...
Brett Lee

ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలింగ్ లెజెండ్ బ్రెట్ లీ, అంతర్జాతీయ క్రికెట్‌లో 718 వికెట్లు పడగొట్టాడు. టీ20ల్లో మొట్టమొదటి హ్యాట్రిక్ తీసిన బౌలర్‌గా నిలిచిన బ్రెట్ లీ, బ్యాటుతోనూ రాణించాడు..

26

‘ప్రతీ ఒక్కరూ విరాట్ కోహ్లీని గమినిస్తూ ఉంటారు. విరాట్ కోహ్లీ గురించి ఎవరెవరు ఏమేం చెబుతున్నారో నేను అన్నీ వింటూ ఉంటా. కోహ్లీ అది అని, కోహ్లీ ఇది అని... ఎవేవో అంటారు...

36
Image Credit: Anushka Sharma Instagram

అయితే విరాట్ కోహ్లీ ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న బెస్ట్ క్రికెటర్లలో ఒకడు. అందులో ఎలాంటి సందేహం లేదు. సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా, జాక్వెస్ కలీస్ వంటి ప్లేయర్ల ఆటను చూసే అవకాశం దక్కడం మన అదృష్టం...

46
Virat Kohli

విరాట్ కోహ్లీ బెస్ట్ క్రికెటర్ మాత్రమే కాదు వరల్డ్ బెస్ట్ అథ్లెట్ కూడా. అతని ఫిట్‌నెస్ చూడండి. ఇన్ని ఏళ్లుగా ఎలాంటి పర్ఫామెన్స్ ఇస్తున్నాడో చూడండి. అతని గణాంకాలు గమనించండి...  

56
virat kohli

అలాంటి ప్లేయర్‌ని వదులుకోవాలని ఎవ్వరైనా అనుకుంటారా. అతను బంగారం. విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్లు తరానికి ఒక్కడే వస్తారు. విరాట్ రోజు రోజుకీ తనని మరింత మెరుగుపర్చుకుంటాడు. అతని ఆటకి నేను వీరాభిమానిని...

66
Image credit: Getty

130 కోట్ల మంది అభిమానులు, విరాట్ కోహ్లీ ఆడిన ప్రతీ సారీ సెంచరీ చేయాలని కోరుకుంటారు. ఇంత ప్రెషర్‌ని తట్టుకుంటూ పర్ఫామెన్స్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు... అది అందరూ గుర్తుపెట్టుకోవాలి...’ అంటూ కామెంట్ చేశాడు ఆసీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ... 

Read more Photos on
click me!

Recommended Stories