టీమిండియాకి గుడ్‌న్యూస్... కరోనా నుంచి కోలుకున్న వృద్ధిమాన్ సాహా, ఇంగ్లాండ్ టూర్‌కి...

First Published May 18, 2021, 11:50 AM IST

ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం సిద్ధమవుతున్న టీమిండియాకి ఇది నిజంగానే గుడ్‌న్యూస్. ఐపీఎల్ 2021 సీజన్‌ మధ్యలో కరోనా బారిన పడిన టీమిండియా టెస్టు వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా, కరోనా నుంచి కోలుకున్నాడు...

మే4న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకి ఆడుతున్న వృద్ధిమాన్ సాహాకి కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మే 14న నిర్వహించిన పరీక్షల్లో కూడా సాహాకి పాజిటివ్ వచ్చింది.
undefined
ఇంగ్లాండ్ టూర్‌కి ఎంపికైన జట్టులో చోటు దక్కించుకున్న సాహా, త్వరగా కోలుకోకపోతే జట్టులో చోటు కోల్పోవాల్సి వస్తుందని భయపడ్డారు క్రికెట్ ఫ్యాన్స్.
undefined
అయితే తాజాగా నిర్వహించిన పరీక్షల్లో వృద్ధిమాన్ సాహాకి మూడు సార్లు నెగిటివ్ రిజల్ట్ వచ్చింది. మే 4 నుంచి ఢిల్లీలోని హోటల్‌లోనే లాంగ్ క్వారంటైన్, ఐసోలేషన్‌లో గడిపిన సాహా, ఇక ఇంగ్లాండ్ టూర్‌కోసం సిద్దం కాబోతున్నాడు.
undefined
‘వృద్ధిమాన్ సాహా కరోనా నుంచి కోలుకుని, రెండు వారాల హోటల్ క్వారంటైన్ పూర్తి చేసుకుని, నిన్ననే ఇంటికి చేరుకున్నాడు. రేపటి నుంచి ఇంగ్లాండ్ టూర్‌కోసం ఇంట్లోనే హోమ్ క్వారంటైన్ గడపబోతున్నాడు సాహా’ అంటూ బీసీసీఐ అధికారులు తెలియచేశారు.
undefined
రిషబ్ పంత్ మంచి ఫామ్‌లో ఉండడంతో న్యూజిలాండ్‌తో జరిగే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో వృద్ధిమాన్ సాహాకి చోటు దక్కడం దాదాపు అసాధ్యమే. అయితే ఆ తర్వాత జరిగే ఐదు టెస్టుల సిరీస్‌కి సాహా కీలకం కానున్నాడు.
undefined
ఇంగ్లాండ్‌ టూర్‌లో ఐదు టెస్టులు ఆడనున్న భారత జట్టు బృందంలో రిషబ్ పంత్‌తో పాటు వృద్ధిమాన్ సాహా మాత్రమే వికెట్ కీపర్‌గా ఎన్నికయ్యాడు. సాహా ఫిట్‌నెస్ నిరూపించుకుంటే, ఇంగ్లాండ్ టూర్‌కి పయనం అవుతాడు.
undefined
సుదీర్ఘ టెస్టు సిరీస్‌లో రిషబ్ పంత్ గాయపడితే ఆ స్థానంలో రిప్లేస్‌మెంట్‌కి వృద్ధిమాన్ సాహా చాలా కీలకం. కెఎల్ రాహుల్‌ను కూడా ఎంపికచేసినా, అతని నుంచి కూడా ఇంకా ఫిట్‌నెస్ క్లియరెన్స్ రావాల్సి ఉంది.
undefined
పంజాబ్ కింగ్స్ జట్టుకి కెప్టెన్‌గా వ్యవహారించిన కెఎల్ రాహుల్, ఐపీఎల్ 2021 సీజన్ మధ్యలో కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరాడు. ఆ తర్వాత అతన్ని పరీక్షించిన వైద్యులు, అపెండిక్స్ సర్జరీ నిర్వహించారు...
undefined
ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న కెఎల్ రాహుల్, ఫిట్‌నెస్ క్లియరెన్స్ తెచ్చుకుంటే, ఇంగ్లాండ్‌కి వెళ్లే ఛార్టెడ్ ఫ్లైట్ ఎక్కుతాడు. ఒకవేళ ఫిట్‌నెస్ నిరూపించుకోవడం ఫెయిల్ అయితేశ్రీలంక టూర్‌కి వెళ్లే టీమిండియాకి కెప్టెన్‌గా వ్యవహారించే అవకాశం దక్కొచ్చు.
undefined
click me!