పింక్ బాల్ టెస్టు: కుప్పకూలిన టీమిండియా... జో రూట్ స్పిన్ మ్యాజిక్‌ ముందు...

Published : Feb 25, 2021, 04:13 PM IST

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో మొదటి రోజు మంచి ఆధిక్యం కనబర్చిన టీమిండియా, రెండో రోజు ప్రత్యర్థి జట్టుకి ఆధిక్యాన్ని అప్పగించింది. ఓవర్‌నైట్ స్కోరు 99/3 వద్ద రెండో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియా, మరో 46 పరుగులు మాత్రమే చేర్చి మిగిలిన ఏడు వికెట్లు కోల్పోయింది. భారత జట్టు 145 పరుగులకి ఆలౌట్ కాగా, తొలి ఇన్నింగ్స్‌లో 33 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది. ఇంగ్లాండ్ స్పిన్నర్ జాక్ లీచ్‌తో పాటు కెప్టెన్ జో రూట్ రికార్డు ఫిగర్స్ నమోదు చేయడం విశేషం. 

PREV
19
పింక్ బాల్ టెస్టు: కుప్పకూలిన టీమిండియా... జో రూట్ స్పిన్ మ్యాజిక్‌ ముందు...

రెండో రోజు ఆటలో ఓవర్‌నైట్ స్కోరుకి 15 పరుగులు జోడించిన తర్వాత అజింకా రహానే వికెట్ కోల్పోయింది టీమిండియా. 25 బంతుల్లో ఓ ఫోర్‌తో 7 పరుగులు చేసి జాక్ లీచ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు రహానే...

29

ఆ తర్వాత 96 బంతులల్లో 11 ఫోర్లతో 66 పరుగులు చేసిన రోహిత్ శర్మ కూడా జాక్ లీచ్ బౌలింగ్‌లోనే ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు...

39

ఆ తర్వాత రిషబ్ పంత్ ఒక్క పరుగుకే అవుట్ అయ్యాడు. జో రూట్ బౌలింగ్‌లో బెన్ ఫోక్స్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు రిషబ్ పంత్...

49

తొలి బంతికే రిషబ్ పంత్‌ను అవుట్ చేసిన ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్... మొదటి 3 ఓవర్లలో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మూడు వికెట్లు తీయడం విశేషం...

59

వాషింగ్టన్ సుందర్ 12 బంతులు ఆడి పరుగులేమీ చేయకుండా, జో రూట్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు...ఆ తర్వాత రెండు బంతులకే అక్షర్ పటేల్ అవుట్ అయ్యాడు. 

69

 జో రూట్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించిన అక్షర్ పటేల్, డిమినిక్ సిబ్లీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 125 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది టీమిండియా..

79

32 బంతుల్లో మూడు ఫోర్లతో 17 పరుగులు చేసిన రవిచంద్రన్ అశ్విన్, జో రూట్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి జాక్ క్రావ్లేకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 

89

అశ్విన్ అవుటైన తర్వాత ఇషాంత్ శర్మ ఓ భారీ సిక్సర్ బాదాడు. వందో టెస్టు ఆడుతున్న ఇషాంత్ శర్మ, టెస్టు కెరీర్‌లోనే మొట్టమొదటి సిక్స్ బాదడం విశేషం. 

99

రూట్ బౌలింగ్‌లో బుమ్రా ఎల్బీడబ్ల్యూగా అవుట్ కావడంతో 145 పరుగుల వద్ద భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌కి తెరపడింది. 6.2 ఓవర్లు వేసిన జో రూట్, 8 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. జో రూట్ బెస్ట్ బౌలింగ్ ప్రదర్శన ఇదే...

click me!

Recommended Stories