ఈ ఏడాది అక్టోబర్ నుంచి భారత్ వేదికగా జరుగబోయే ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ను సక్సెస్ చేసేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సన్నాహకాలు చేస్తున్నది. అయితే వరల్డ్ కప్ ప్రారంభానికి గట్టిగా నాలుగు నెలల సమయం కూడా లేదు. అయినప్పటికీ ఇంకా ఇందుకు సంబంధించిన షెడ్యూల్ విడుదల కాలేదు.
25
అయితే వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదలలో జాప్యానికి కారణం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అనుసరిస్తున్న తీరేనని విమర్శలు వినిపిస్తున్నాయి.ఈ మెగా టోర్నీ ఆడేందుకు పాకిస్తాన్.. భారత్ కు వస్తుందా..? రాదా..? అన్నది తేలాల్సి ఉంది. దీనిపై పీసీబీ పూటకో మాట మారుస్తోంది.
35
ఇక వరల్డ్ కప్ వేదికల మీద కూడా పాకిస్తాన్ కొర్రీలు పెడుతోంది. ఇన్నాళ్లూ అహ్మదాబాద్ లో మ్యాచ్ ఆడమని చెప్పిన పాకిస్తాన్ తాజాగా చెన్నైలో కూడా ఆడమని పసలేని వాదనలు చేస్తోంది. అహ్మదాబాద్ లో భద్రతా కారణాలను చూపుతున్న పీసీబీ.. చెన్నైలో అఫ్గాన్ తో మ్యాచ్ అయితే తమకు ఇక్కట్లు తప్పవని ఆరోపిస్తుంది.
45
Image credit: Getty
దీంతో గత వారమే రిలీజ్ కావాల్సిఉన్న వరల్డ్ కప్ షెడ్యూల్ ఇప్పటికీ విడుదల కాలేదు. అసలు ఈ నెలాఖరుకైనా వస్తుందా..? లేదా..? అన్నదీ క్లారిటీ లేదు. దీంతో బీసీసీఐ.. పీసీబీ వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహంగా ఉంది. వరల్డ్ కప్ షెడ్యూల్ జాప్యానికి కారణం పాకిస్తానే అని బీసీసీఐ ఆరోపిస్తోంది.
55
ఇదే విషయమై బీసీసీఐ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. ‘పీసీబీ తమకు నచ్చినట్టుగా ఏదైనా మాట్లాడొచ్చు. కానీ వాస్తవం ఏంటంటే వరల్డ్ కప్ షెడ్యూల్ జాప్యానికి ఆ దేశ క్రికెట్ బోర్డే కారణం. మొన్నటిదాకా వాళ్లు అహ్మదాబాద్ లో ఆడమని అన్నారు. ఇప్పుడేమో చెన్నైలో మేం ఆడలేమని చెబుతున్నారు. వాళ్లు నిత్యం ఏదో అభద్రతా భావంతో ఉంటున్నారు..’అని తెలిపాడు.