ఇదేం బ్యాటింగ్‌రా బాబూ... ఎలాంటి బంతులేసినా లాభం లేకపోయింది... పూజారాపై కమ్మిన్స్ కామెంట్!!

First Published Feb 12, 2021, 3:54 PM IST

2019 ఆస్ట్రేలియా పర్యటనలో మూడు సెంచరీలతో అదరగొట్టిన ఛతేశ్వర్ పూజారా, ఈ ఏడాది ఆసీస్ టూర్‌లో మాత్ర ఆ స్థాయిలో రాణించలేకపోయాడు. నాలుగు టెస్టుల్లో ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయినా మూడు అద్భుత హాఫ్ సెంచరీలతో భారత బ్యాటింగ్ ఆర్డర్‌కి వెన్నెముకగా మారాడు. నాలుగు టెస్టుల్లోనూ 200లకు పైగా బంతులు ఎదుర్కొన్న ఛతేశ్వర్ పూజారా, గబ్బా టెస్టుల్లో వికెట్లకు అడ్డంగా శరీరంగా పెట్టి బ్యాటింగ్ చేసిన విధానం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ఇండియా, ఆస్ట్రేలియా సిరీస్‌లో నాలుగు టెస్టుల్లో 21 వికెట్లు తీసి, ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు గెలుచుకున్న ప్యాట్ కమ్మిన్స్... ఛతేశ్వర్ పూజారా బ్యాటింగ్ గురించి మాట్లాడాడు... పూజారా పట్టుదల మాత్రం బౌలర్ల పవర్ నిలవలేకపోయిందని చెప్పుకొచ్చాడు ప్యాట్ కమ్మిన్స్...
undefined
‘తొలి టెస్టు తర్వాత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వెళ్లిపోయాడు. అప్పుడు మా నెక్ట్స్ టార్గెట్ ఛతేశ్వర్ పూజారానే. గత పర్యటనలో పూజారా చాలా బాగా ఆడాడు. అందుకే అతనికి బౌలింగ్ చేయడమే చాలా కీలకమని భావించాం. పూజారాని వీలైనంత త్వరగా అవుట్ చేయాలని ప్రణాళికలు రూపొందించుకున్నాం...
undefined
అయితే పూజారా పట్టుదల ముందు మా ప్రణాళికలు ఏ మాత్రం పని చేయలేదు. సిడ్నీ టెస్టులో డ్రా అయినా, గబ్బాలో విజయం అయినా ఛతేశ్వర్ పూజారా ఇన్నింగ్స్ చాలా కీలకం... అతను నిలదొక్కుకుని భాగస్వామ్యాలు నిర్మించడం వల్లే మిగిలిన ప్లేయర్లు దాన్ని కొనసాగించగలిగారు... క్రీజులో పాతుకుపోతే పరుగులు వాటంతట అవే వస్తాయనే ధీమా పూజారాలో కనిపించింది...
undefined
ఎలాంటి బంతులు వేసినా, ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపించాడు ఛతేశ్వర్ పూజారా... అలాంటి ప్లేయర్‌ను అవుట్ చేసేందుకు ఎలాంటి బంతులు వేసినా ఉపయోగం ఉండదు. కొన్ని సార్లు మన సత్తాపైనే మనకి అనుమానాలు కలిగేలా చేస్తాడు పూజారా... అతన్ని ఎలా అవుట్ చేయాలో తెలియలేదు...’ అంటూ చెప్పుకొచ్చాడు కమ్మిన్స్.
undefined
టీమ్ మీటింగ్‌లో ఛతేశ్వర్ పూజారా గురించి చర్చిస్తుంటే, సీనియర్ పేసర్ జోష్ హజల్‌వుడ్ అసహనంతో అక్కడికి వెళ్లిపోయాడట. ‘క్రీజులో పూజారానే ఉంటాడు... నాన్‌స్టైకింగ్‌లో పూజారానే ఉంటాడు... ఇప్పుడు టీమ్ మీటింగ్‌లో కూడా అతనేనా...’ అంటూ హజల్‌వుడ్ తన క్యాప్ విసిరేసి అసహనంతో వెళ్లిపోయాడని భారత ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్‌తో ఆసీస్ టీమ్ సభ్యులు చెప్పారట.
undefined
గబ్బా టెస్టులో పట్టువదలని అంకిత భావం, మొండి పట్టుదలతో బ్యాటింగ్ కొనసాగించిన ఛతేశ్వర్ పూజారా... 211 బంతుల్లో 56 పరుగులు చేశాడు. దాదాపు 14 బంతులు ఛతేశ్వర్ పూజారా శరీరానికి తగిలాయి. ఆ నొప్పిని భరిస్తూనే బ్యాటింగ్ కొనసాగించిన పూజారా... ఐదు గంటల పాటు క్రీజులో నొలదొక్కుకుపోయాడు...
undefined
ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 73 పరుగులు చేసిన ఛతేశ్వర్ పూజారా... అనుకోని విధంగా అవుట్ అయ్యాడు. పూజారా కొట్టిన షాట్, ఫీల్డర్ హెల్మెట్‌కి తాకి, మరో ఫీల్డర్ చేతుల్లోకి వెళ్లింది...
undefined
click me!