Pat Cummins
IPL 2024: దుబాయ్ లోని కోకకోలా ఎరీనాలో జరిగిన ఐపీఎల్ 2024 వేలంలో అంచనాలను మించి సంచలనాలు నమోదయ్యాయి. అనుకున్నదాని కంటే అధికంగా స్టార్ ప్లేయర్ల కోసం ఫ్రాంఛైజీలు కోట్లు కుమ్మరించాయి. ఇదే సమయంలో కొంత మంది స్టార్ ఆటగాళ్లను పెద్దగా పట్టించుకోలేదు. మరికొందరికి అనుకున్న ప్రైస్ దక్కలేదు. ఈ వేలంలో ఆస్ట్రేలియా ప్లేయర్ల హవా కొనసాగింది. ఆసీస్ స్టార్ ప్లేయర్ల కోసం ఫ్రాంఛైజీలు తెగ పోటీ పడ్డాయి.
ఐపీఎల్ 2024 వేలంలో గత రికార్డులన్ని బ్రేయ్ అయ్యయి. ఐపీఎల్ చరిత్రలోనే ఎప్పుడూ లేనంతగా ధరలు పెట్టి ప్లేయర్స్ ను దక్కించున్నాయి ఫ్రాంఛైజీలు. ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ మిచెల్ స్టార్క్ ను కోల్‌కతా నైట్ రైడర్స్ రూ. 24.75 కోట్లు పెట్టి అతన్ని దక్కించుకుంది. అతని బేస్ ప్రైస్ రూ.2 కోట్లు మాత్రమే. కానీ అతని కోసం కోల్ కతా టీం ఐపీఎల్ చరిత్ర వేలంలోనే కొత్త రికార్డును సృష్టించింది. మరో ఆస్ట్రేలియా ప్లేయర్, ఐపీఎల్ చరిత్రలో మొదటిసారి రూ.20 కోట్ల ధర మార్కును అందుకున్న ప్లేయర్ ప్యాట్ కమ్మిన్స్. ఈ ఆసీస్ స్టార్ ప్లేయర్ ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.20.50 కోట్లకు దక్కించుకుంది. అతని బేస్ ప్రైస్ రూ. కోట్లు. మరీ హైదరాబాద్ టీం అంచనాలను నిజం చేస్తాడా లేదా అనేది చూడాలి.. !
అయితే, ఐపీఎల్ టైటిల్ ఫ్రైజ్ కంటే అధికంగా, ఇంత భారీగా మనీ చెల్లించిన ప్లేయర్లను దక్కించుకోవడం హాట్ టాపిక్ గా మారింది. నెటిజన్ల మాత్రమే కాకుండా క్రికెట్ ప్రియులు, విశ్లేషకులు సైతం రూ.20 కోట్లకు పైగా ఒక్క ప్లేయర్ కోసం ఖర్చు చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో పలువురు ఇది వెర్రి, పిచ్చి అంటూ ట్రోల్స్ తో విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా కోల్ కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీలపై సోషల్ మీడియాలో పంచులు పెలుతున్నాయి.
టోర్నీ టైటిల్ కంటే ఎక్కువ ప్రైజ్ పెట్టి దక్కించుకున్న మిచెల్ స్టార్క్, ప్యాట్ కమ్మిన్స్ లు ఆయా ఫ్రాంఛైజీలు పెట్టుకున్న అంచనాలను అందుకుంటారా? అనేది అసక్తికరంగా మారింది. ఈ ఇద్దరు ప్లేయర్ల కంటే మెరుగైన ప్లేయర్లు కూడా ఉన్నప్పటికీ ఫ్రాంఛైజీలు ఐపీఎల్ 2024 వేలం మాదిరిగా కనక వర్షం కురిపించలేదు. ఇదే సమయంలో భారీ ధరల పలుకుతారున్న పలు ప్లేయర్లకు ఆయా టీంలు పట్టించుకోలేదు. ఏంటీ గురు టీమ్ లు ఇలా చేస్తున్నాయని పలువురు క్రికెట్ ప్రియులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ట్రోల్ చేస్తున్నారు. అయితే, రానున్ను ఐపీఎల్ 2024 సీజన్ తోనే దీనికి సమాధానం దోరుకుతుంది. ఈ ప్లేయర్లు ఏ మేరకు రాణిస్తారో చూడాలి మరి.. !