ఐపీఎల్ 2024 వేలంలో కోట్ల రూపాయ‌లు కొల్ల‌గొట్టిన టాప్-10 ప్లేయ‌ర్స్ వీళ్లే..

First Published | Dec 20, 2023, 1:39 PM IST

Top 10 costliest Players: మిచెల్ స్టార్క్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. రెండుసార్లు ఛాంపియన్ అయిన కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ అత‌ని కోసం ఏకంగా రూ .24.75 కోట్ల ఖ‌ర్చు చేసింది. 
 

Top 10 costliest Players in IPL Auction 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 ఎడిషన్ కు ముందు డిసెంబర్ 19న దుబాయ్ లో జరిగిన ఆటగాళ్ల వేలంలో జట్లు తమ డబ్బును కొందరు హైప్రొఫైల్ క్రికెటర్ల కోసం భారీగా వెచ్చించాయి. ప్రపంచకప్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు.  ఆ త‌ర్వాత కొద్ది సేప‌టికే ఈ రికార్డు బ‌ద్ద‌లైంది. అత‌ని రికార్డును సహచరుడు మిచెల్ స్టార్క్ బ‌ద్ద‌లు కొట్టాడు. మిచెల్ స్టార్క్ ను కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ ఏకంగా రూ .24.75 కోట్లతో అత‌న్ని ద‌క్కించుకుంది. ఈ ఐపీఎల్ వేలంలో అంతర్జాతీయ ఆటగాళ్లతో పాటు కొందరు దేశవాళీ క్రికెట్ ప్లేయ‌ర్ల‌కు కూడా మంచి ఆదరణ లభించింది.

ఐపీఎల్ 2024 వేలంలో అత్య‌ధిక ధ‌ర ప‌లికిన టాప్-10 ప్లేయ‌ర్స్..

Mitchell Starc

మిచెల్ స్టార్క్

 ఆస్ట్రేలియా స్టార్ ప్లేయ‌ర్ మిచెల్ స్టార్క్ ను కోల్‌కతా నైట్ రైడర్స్  రూ. 24.75 కోట్లు పెట్టి అత‌న్ని ద‌క్కించుకుంది. అత‌ని బేస్ ప్రైస్ రూ.2 కోట్లు మాత్ర‌మే. కానీ అత‌ని కోసం కోల్ క‌తా టీం ఐపీఎల్ చ‌రిత్ర వేలంలోనే కొత్త రికార్డును సృష్టించింది. 
 


ప్యాట్ కమ్మిన్స్

మ‌రో ఆస్ట్రేలియా ప్లేయ‌ర్, ఐపీఎల్ చ‌రిత్ర‌లో మొద‌టిసారి రూ.20 కోట్ల ధ‌ర మార్కును అందుకున్న ప్లేయ‌ర్ ప్యాట్ కమ్మిన్స్. ఈ ఆసీస్ స్టార్ ప్లేయ‌ర్ ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.20.50 కోట్ల‌కు ద‌క్కించుకుంది. అత‌ని బేస్ ప్రైస్ రూ. కోట్లు. మ‌రీ హైద‌రాబాద్ టీం అంచ‌నాల‌ను నిజం చేస్తాడా లేదా అనేది చూడాలి.. ! 

Daryl Mitchell

డారెల్ మిచెల్

మిచెల్ స్టార్క్, ప్యాట్ క‌మ్మిన్స్ త‌ర్వాత 2024 ఐపీఎల్ వేలంలో అత్య‌ధిక ధ‌ర ప‌లికిన ఆట‌గాడు డారెల్ మిచెల్. ఈ న్యూజిలాండ్ ప్లేయ‌ర్ ను చెన్నై సూపర్ కింగ్స్ రూ.14.00 కోట్ల‌కు ద‌క్కించుకుంది. అత‌ని బేస్ ప్రైస్ కోటి రూపాయ‌లు. 

హర్షల్ పటేల్

ఐపీఎల్ 2024 మినీ వేలంలో దేశవాలీ క్రికెట‌ర్ల‌పై కూడా ఐపీఎల్ ఫ్రాంఛైజీలు క‌నక వ‌ర్షం కురిపించాయి. ఇండియ‌న్ ప్లేయ‌ర్ హర్షల్ పటేల్ ను పంజాబ్ కింగ్స్ రూ. 11.75 తో ద‌క్కించుకుంది. అత‌ని బేస్ ప్రైస్ రూ.2 కోట్లు. ఈ ప్లేయ‌ర్ కోసం చాలా జ‌ట్లు పోటీ ప‌డ్డాయి. 

అల్జారీ జోసెఫ్

వెస్టిండీస్ ఫాస్ట్ బౌల‌ర్ అల్జారీ జోసెఫ్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.11.50 కోట్ల‌తో ద‌క్కించుకుంది. అత‌ని బేస్ ప్రైస్ రూ.1 కోట్లు. ఎప్పుడూ బౌలింగ్ లో విఫ‌ల‌మవుతున్న బెంగ‌ళూరు టీంలో జోసెఫ్ స‌త్తా చాటుతాడా లేదా అనే చూడాలి మ‌రి.. ! 

స్పెన్సర్ జాన్సన్

ఆస్ట్రేలియా బౌల‌ర్ స్పెన్సర్ జాన్సన్ ను ఐపీఎల్ ఎంట్రీతోనే క‌ప్పు కొట్టిన గుజ‌రాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది. రూ.50 లక్ష‌ల బేస్ ధ‌ర ఉన్న అత‌ని కోసం గుజ‌రాత్ ఏకంగా రూ.10 కోట్లు ఖ‌ర్చు చేసింది. 

సమీర్ రిజ్వీ

దేశీయ ప్లేయ‌ర్, యూపీ ధ‌నాధ‌న్ హిట్ట‌ర్ సమీర్ రిజ్వీని చెన్నై సూపర్ కింగ్స్ కొనుగులో చేసింది. అత‌ని బేస్ ధ‌ర రూ.20 ల‌క్ష‌లు కాగా, అత‌ని కోసం చెన్నై రూ. 8.40 కోట్ల బిడ్ తో ద‌క్కించుకుంది. 

Image credit: PTI

రిలీ రోసౌ

సౌతాఫ్రికా ప్లేయ‌ర్ రిలీ రోసౌ ను పంజాబ్ కింగ్స్  రూ. 8 కోట్ల‌తో ద‌క్కించుకుంది. అత‌ని బేస్ ప్రైస్ రెండు కోట్లు.  అండ‌ర్ 19 వ‌ర‌ల్డ్ క‌ప్ హీరోగా, ధ‌నాధ‌న్ లెఫ్ట్ ఆర్మ్ ప్లేయ‌ర్ గా మంచి గుర్తింపు ఉంది. 

షారుఖ్ ఖాన్

మ‌రో దేశీయ స్టార్ ప్లేయ‌ర్ షారుఖ్ ఖాన్ పై దాదాపు అన్ని టీంలు ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శించాయి. కానీ ఐపీఎల్ 2024 వేలం పాట‌లో గుజరాత్ టైటాన్స్ అత‌న్ని రూ 7.40 కోట్ల‌కు ద‌క్కించుకుంది. అత‌ని బేస్ ప్రైస్ రూ.40 ల‌క్ష‌లు. 
 

రోవ్‌మాన్ పావెల్

ఐపీఎల్ 2024 వేలంలోకి వ‌చ్చిన మొద‌టి ప్లేయ‌ర్ రోవ్‌మాన్ పావెల్. ఈ వెస్టిండీస్ స్టార్ ను రాజస్థాన్ రాయల్స్ రూ. 7.40 కోట్లు పెట్టి ద‌క్కించుకుంది. 

Latest Videos

click me!