మొన్న అహ్మదాబాద్‌లో ఆడమన్నారు! ఇప్పుడు చెన్నైలో వద్దంటూ... వన్డే వరల్డ్ కప్‌ విషయంలో పాకిస్తాన్ కోరికలు...

Published : Jun 20, 2023, 10:50 AM IST

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ఇంకా నాలుగు నెలల సమయం కూడా లేదు. 2022 టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్‌ని ఏడాది ముందే రిలీజ్ చేసిన ఐసీసీ, వన్డే వరల్డ్ కప్ విషయంలో ఇంకా స్పష్టమైన క్లారిటీకి రాలేదు..  

PREV
17
మొన్న అహ్మదాబాద్‌లో ఆడమన్నారు! ఇప్పుడు చెన్నైలో వద్దంటూ... వన్డే వరల్డ్ కప్‌ విషయంలో పాకిస్తాన్ కోరికలు...

ఆసియా కప్ 2023 టోర్నీ విషయంలో ఇండియా, పాకిస్తాన్ బోర్డుల మధ్య విభేదాలు రావడంతో పాక్ జట్టు, ఇండియాలో జరిగే వన్డే వరల్డ్ కప్ ఆడేందుకు వస్తుందా? లేదా? అనే విషయంలో చాలా నెలల పాటు సందిగ్ధం నెలకొంది..
 

27

ఎట్టకేలకు హైబ్రీడ్ మోడల్‌లో ఆసియా కప్ 2023 టోర్నీలో నాలుగు మ్యాచులు పాక్‌లో, మిగిలిన మ్యాచులు శ్రీలంకలో నిర్వహించబోతున్నట్టు ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది..

37

అయితే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో పాకిస్తాన్, ఇండియాలో ఆడే మ్యాచ్‌లపై మాత్రం ఇంకా డ్రామా కొనసాగుతూనే ఉంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ పెట్టవద్దని పీసీబీ అధ్యక్షుడు నజం సేథీ డిమాండ్ చేశాడు..

47

అయితే పీసీబీ డిమాండ్‌ని పట్టించుకోని ఐసీసీ, నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలోనే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌కి ఏర్పాట్లు చేస్తోంది. ఆ తర్వాత చెన్నైలో ఆఫ్ఘాన్‌తో మ్యాచ్ ఆడనుంది పాకిస్తాన్...
 

57

పసికూన జట్టు అయినా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్‌ల్లో హైడ్రామా ఓ లెవెల్‌లో ఉంటుంది. గత మూడు మ్యాచుల్లోనూ ఆప్ఘాన్, పాకిస్తాన్‌కి చుక్కలు చూపించింది. విజయం దాకా వచ్చి, దాయాది గుండెల్లో రైళ్లు పరుగెత్తిచ్చింది..

67
Afghanistan

చెన్నైలోని చెపాక్ స్టేడియం స్పిన్నర్లకు అద్భుతంగా సహకరిస్తుంది. ఆఫ్ఘాన్ టీమ్‌లో రషీద్ ఖాన్ వంటి బెస్ట్ స్పిన్నర్లు ఉన్నారు. అందుకే చెన్నైలో ఆఫ్ఘాన్‌తో మ్యాచ్ ఆడేందుకు పాకిస్తాన్ ఇష్టపడడం లేదు..

77
Afghanistan vs Pakistan

మరి పాకిస్తాన్‌ అభ్యర్థనను ఐసీసీ మన్నిస్తుందా? ఆఫ్ఘాన్‌తో మ్యాచ్‌ని అయినా చెన్నై నుంచి మారుస్తుందా? లేక అక్కడే ఆడాల్సిందేనని తేల్చి చెప్పేస్తుందా? తెలియాలంటే షెడ్యూల్ విడుదల అయ్యేదాకా ఆగాల్సిందే.. 

click me!

Recommended Stories