ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌లో చోటు దక్కకపోవడంతో రవిచంద్రన్ అశ్విన్ చాలా హార్ట్ అయినట్టు ఉన్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిసిన తర్వాత స్వదేశానికి చేరుకున్న తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్న అశ్విన్, కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు..
‘ఒకప్పుడు క్రికెట్ ఆడుతుంటే టీమ్‌లో అందరూ ఫ్రెండ్సే ఉండేవాళ్లు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అందరూ కోలీగ్స్‌గా మారిపోయారు. ఫ్రెండ్స్ కలిసి ఆడడానికి, కోలిగ్స్ కలిసి ఆడడానికి చాలా తేడా ఉంది...
25
Image credit: Getty
టీమ్‌లో ఉన్న ప్రతీ ఒక్కరూ కూడా మిగిలిన వాళ్ల కంటే మనం ముందు ఉండాలనే ఆలోచనతోనే ఉంటున్నారు. అంతే తప్ప, ఎవ్వరికీ కలిసి ప్రశాంతంగా మాట్లాడుకునే సమయం కూడా ఉండడం లేదు...
35
Ravichandran Ashwin
ఓ రకంగా టీమిండియా వాతావరణం ఇప్పుడు కార్పొరేట్ కల్చర్‌లా మారిపోయింది. నువ్వు ఇది చేయగలవనే చెప్పేవాళ్లు, ప్రోత్సహించేవాళ్లు లేరు. నా ఉద్దేశంలో క్రికెట్‌లో భాగస్వామ్యం చాలా అవసరం..
45
నీ అనుభవాలను తోటి ప్లేయర్‌తో పంచుకున్నప్పుడే మంచి వాతావరణం ఏర్పడుతుంది. అవతలి వ్యక్తి టెక్నిక్‌ని అర్థం చేసుకోవడం, అతని జర్నీలో భాగమైనప్పుడే టీమ్ బాగుంటుంది..
55
ఇప్పుడు సాయం చేసేవాళ్లు కానీ, సాయం చేయాలనే ఆలోచన ఉన్నవాళ్లు కానీ టీమ్‌లో లేరు. సాయం కావాలంటే అధికారులను కలవచ్చు కానీ ఆ అవసరం కూడా చూసుకునే బాండింగ్, ప్లేయర్ల మధ్య అవసరం...’ అంటూ కామెంట్ చేశాడు రవిచంద్రన్ అశ్విన్..