గేమ్‌కి ముందు ఆ సుఖం అనుభవిస్తే... ఫైనల్స్ గెలవాలంటే భారత ఆటగాళ్లు, దాన్ని అలవాటు చేసుకోవాలి...

First Published Jul 3, 2021, 1:27 PM IST

భారత జట్టును ఎన్నో దశాబ్దాలుగా వేధిస్తున్న సమస్య ఫైనల్ ఫివర్... ఐసీసీ టోర్నీల్లో రికార్డు స్థాయిలో ఫైనల్ చేరిన భారత జట్టు, టైటిల్స్ గెలిచింది మాత్రం నాలుగుసార్లు మాత్రమే... దీంతో ఫైనల్ మ్యాచ్‌కి ముందు సెక్స్ చేసి, మ్యాచ్ ప్రెషర్‌ను తగ్గించుకోవాలని సలహా ఇచ్చాడట భారత మాజీ మనోస్థితి కోచ్ ప్యాడీ అప్టన్...

2007 టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో సరైన హెడ్‌కోచ్ లేకుండానే టైటిల్ సాధించిన మహేంద్ర సింగ్ ధోనీ టీమ్, ఆ తర్వాత 2011 వరల్డ్‌కప్ సమయంలో గ్యారీ కిర్‌స్టన్ కోచింగ్‌లో టైటిల్ గెలిచింది...
undefined
ఆ తర్వాత డంకెన్ ఫ్లెంచర్ కోచింగ్‌లో భారత జట్టు 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను అందుకుంది. అయితే 2011 వన్డే వరల్డ్‌ కప్ విజయం సమయంలో భారత జట్టుకి మెండల్ కండీషనల్ కోచ్‌గా వ్యవహరించాడు ప్యాడీ అప్టన్..
undefined
ఆ సమయంలో టీమిండియాకి కోచ్‌గా వ్యవహరించిన గ్యారీ కిర్‌స్టన్, ప్యాడీ అప్టన్‌ను ప్రత్యేకంగా పిలిపించి మరీ టీమిండియాకి మెంటల్ కండీషనింగ్ కోచ్‌గా బాధ్యతలు అప్పగించాడు. ఈయనకు అప్పట్లో భారీగా ముట్టుచెప్పినట్టు టాక్...
undefined
ఆటగాళ్లపై క్రికెట్, పర్ఫామెన్స్, షెడ్యూల్స్, ఫైనల్స్ కారణంగా మానసిక ఒత్తిడి పడకుండా, వారి మెంటల్ కండీషన్ ఎప్పుడు ఒకేలా ఉండడం చూడడమే అప్టన్ పని. మెంటల్ కండీషన్ స్టేబుల్‌గా ఉండేందుకు అప్టన్ ఓ వింత సలహా ఇచ్చాడట...
undefined
‘2011 వన్డే వరల్డ్‌కప్ టోర్నీ నడుస్తోంది. అది టీమిండియాకి చాలా కీలకమైన మ్యాచ్. ప్లేయర్లు అందరూ చాలా ప్రెషర్‌ ఫీలవుతున్నట్టు నేను గుర్తించాను... దాన్ని తగ్గించడం నా బాధ్యత...
undefined
ప్రెషర్ తగ్గేందుకు సెక్స్ చేయాల్సిందిగా భారత క్రికెటర్లకు సూచించాను. అదేమీ నేరం కాదు. సెక్స్ చేస్తే మెంటల్ అండ్ ఫిజికల్ ప్రెషర్స్ దూరం అవుతాయి..
undefined
అయితే ఇండియాలో సెక్స్‌ అంటే అంత సింపుల్ విషయం కాదు. వాళ్లు దానికి చాలా విలువ ఇస్తారు. ఆ విషయం నాకు తర్వాత తెలిసింది.
undefined
దాంతో అలా చెప్పినందుకు కోచ్ కిర్‌స్టెన్‌కి క్షమాపణలు కోరాను...’ అంటూ తన ఆటోబయోగ్రఫీ పుస్తకంలో రాసుకొచ్చాడు ప్యాడీ అప్టన్.
undefined
2009 ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలోనే గేమ్‌కి ముందు సెక్స్‌లో పాల్గొనడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి నోట్స్ రాసి పెట్టినట్టు చెప్పిన ప్యాడీ అప్టన్, చాలాసార్లు దీన్ని బలంగా నమ్మానని చెప్పుకొచ్చాడు...
undefined
click me!