పాక్‌లో పర్యటించడం తమ చేతుల్లో లేదని, కేంద్ర ప్రభుత్వం ఏం చెబితే అది చేస్తామని బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ కామెంట్ చేస్తే.. బీసీసీఐ సెక్రటరీ జై షా మాత్రం ‘ఆసియా కప్ 2023 కోసం భారత జట్టు, పాక్‌కి వెళ్లదు. తటస్థ వేదిక మీద ఈ టోర్నీని నిర్వహిస్తాం...’ అంటూ కుండబద్ధలు కొట్టేశాడు..
ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడిగా ఉన్న జై షా, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పుత్రుడు కావడంతో కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కూడా ఇదేనని తేలిపోయింది. దీంతో టీమిండియా, ఇప్పట్లో పాక్‌లో అడుగు పెట్టదని తేలిపోయింది. అయితే పీసీబీ మాత్రం పాక్‌లోనే ఆసియా కప్ 2023 నిర్వహించి తీరుతామని పట్టుబడుతోంది...
పాకిస్తాన్‌లో జరిగే ఆసియా కప్ 2023కి టీమిండియా రాకపోయినా, పాక్‌లో ఈ టోర్నీ నిర్వహించకపోయినా తాము 2023లో ఇండియాలో జరిగే వన్డే వరల్డ్ కప్‌లో ఆడబోమని సంచలన వ్యాఖ్యలు చేశాడు పీసీబీ ఛైర్మెన్ రమీజ్ రాజా... తాజాగా ఈ విషయంపై తనదైన స్టైల్‌లో స్పందించాడు భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్..
‘గత ఏడాది పీసీబీ ఛైర్మెన్ రమీజ్ రాజా స్వయంగా చెప్పాడు, తమ దగ్గర బీసీసీఐ వద్ద ఉన్నన్ని డబ్బులు లేవని, వాళ్లని కాదని ఏమీ చేయలేమని! ఇండియాకి రాకూడదని మీరు అనుకుంటే... దయచేసి రాకండి. మిమ్మల్ని రండి బాబు... అని ఎవ్వరు బ్రతిమిలాడారు?...
ఐసీసీ టోర్నీల్లో ఆడాలా? వద్దా? అనేది మీ ఇష్టం... పాక్‌లో మా ప్లేయర్లకు భద్రత లేదు, అందుకే మేం టీమిండియాని పాకిస్తాన్‌కి పంపం. అందులో ఎలాంటి మార్పులు ఉండవు... ’ అంటూ హాట్ కామెంట్లు చేశాడు టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్...
Tanvir Ahmed
భజ్జీ వ్యాఖ్యలపై పాక్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ స్పందించాడు. ‘పాక్‌లో భారత ఆటగాళ్లకు భద్రత లేదని, అందుకే అక్కడికి రాలేమని హర్భజన్ సింగ్ చెబుతున్నాడు. అదే పాక్‌లో వరల్డ్ కప్ జరిగినా, భారత జట్టు రాదా? చూద్దాం...’ అంటూ వ్యాఖ్యానించాడు తన్వీర్ అహ్మద్..
దీనికి ‘నీ ఛాలెంజ్‌ని నేను అంగీకరిస్తున్నా. భారత క్రికెట్ జట్టును ఎలా నడిపించాలో మాకు బాగా తెలుసు. పీసీబీ సాయం మాకు అక్కర్లేదు. ప్రభుత్వం అంగీకరిస్తే, పాక్‌లో పర్యటించడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు...
అయితే అక్కడి పరిస్థితులు బాగున్నాయని, భారత జట్టు క్షేమంగా పాక్‌కి వెళ్లి రాగలదని గ్యారెంటీ ఇవ్వగలరా? అలా ఇరు దేశాల మధ్య పరిస్థితులు చక్కబడితే క్రికెట్‌కి సజావుగా జరుగుతుందేమో... అప్పుడు ఎవ్వరికీ ఎలాంటి సమస్యలు ఉండవు...’ అంటూ రిప్లై ఇచ్చాడు హర్భజన్ సింగ్...
india
షెడ్యూల్ ప్రకారం ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే భారత జట్టు, పాక్‌లో పర్యటించేందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తే... ఆ టోర్నీ కూడా పాక్ నుంచి తరలించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి...