టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో భారత జట్టుపై విజయం తర్వాత పాకిస్తాన్ క్రికెటర్ల నోటికి హద్దూ అదుపూ లేకుండా పోయింది. ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీల్లో తొలిసారి టీమిండియాపై విజయాన్ని అందుకోవడం, అదీ 10 వికెట్ల తేడాతో భారీ గెలుపు కావడంతో పాక్ తామే టీమ్ అంటూ ఊహించుకుంటోంది...
అప్పుడు, ఇప్పుడు ఎప్పడూ పాకిస్తాన్ ప్రధాన బలం ఫాస్ట్ బౌలింగ్. ఇంతకుముందు వసీం అక్రమ్, వకార్ యూనిస్, షోయబ్ అక్తర్ వంటి బౌలర్ల తర్వాత పాక్ ఫాస్ట్ బౌలింగ్ విభాగం కాస్త వీక్ అయినట్టు కనిపించింది...
27
అయితే మళ్లీ ఇప్పుడు షాహీన్ షా ఆఫ్రిదీ, హరీస్ రౌఫ్, హసన్ ఆలీ, షాదబ్ ఖాన్ వంటి బౌలర్లతో పాకిస్తాన్ బౌలింగ్ యూనిట్ పటిష్టంగా కనబడుతోంది...
37
టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో అదరగొట్టిన షాహీన్ షా ఆఫ్రిదీ, సెమీ ఫైనల్‌లో హ్యాట్రిక్ సిక్సర్లు సమర్పించి పాక్ చేతుల్లో నుంచి మ్యాచ్‌ని జారవిడిచాడు... అయితే తమ బౌలర్లు తోపులని అంటున్నాడు పాక్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్...
47
‘వరల్డ్‌లోనే మా బౌలింగ్ యూనిట్ ది బెస్ట్. ఆ విషయం మేమే కాదు, చాలా మంది విదేశీ క్రికెటర్లు కూడా ఒప్పుకుంటున్నారు. కొందరు ఇంగ్లాండ్ క్రికెటర్లు మా బౌలర్లను పొగడడం విన్నప్పుడు గర్వంగా అనిపించింది...’ అంటూ కామెంట్ చేశాడు మహ్మద్ రిజ్వాన్...
57
కౌంటీ ఛాంపియన్‌షిప్ టోర్నీలో పాల్గొన్న మహ్మద్ రిజ్వాన్, షాహీన్ షా ఆఫ్రిదీ వంటి పాక్ క్రికెటర్లు, ప్రస్తుతం వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ ఆడబోతున్నారు...
67
గత ఏడాది డిసెంబర్‌లో జరగాల్సిన ఈ వన్డే సిరీస్, కరోనా కారణంగా వాయిదా పడింది. ముల్తాన్ వేదికగా జూన్ 8 నుంచి మూడు వన్డేల సిరీస్ ఆడనుంది పాకిస్తాన్...
77
కౌంటీ ఛాంపియన్‌షిప్ 2022 టోర్నీలో సుసెక్స్ క్లబ్ తరుపున భారత క్రికెటర్ ఛతేశ్వర్ పూజారాతో కలిసి ఆడిన మహ్మద్ రిజ్వాన్, ‘నయా వాల్’ నుంచి ఎంతో నేర్చుకున్నానని చెప్పాడు...