అందుకే ఆ రోజు నాకు చాలా స్పెషల్! మా నాన్న కోసం... విరాట్ కోహ్లీ ఎమోషనల్ కామెంట్స్..

First Published | Aug 16, 2023, 10:34 AM IST

ప్రస్తుత తరంలో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడు విరాట్ కోహ్లీ. మూడు ఫార్మాట్లలో రికార్డుల వర్షం కురిపిస్తున్న విరాట్ కోహ్లీ, ఇప్పటికే సచిన్ టెండూల్కర్ తర్వాత అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా ఉన్నాడు. 

సోషల్ మీడియాలో దాదాపు 350 మిలియన్ల మంది ఫాలోవర్లను కలిగి ఉన్న విరాట్ కోహ్లీ.. 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను బయటపెట్టాడు..


‘మనదేశానికి ఇండిపెండెన్స్ డే ఎంతో ముఖ్యమైన రోజు. నా వరకూ ఇది ఇంకా చాలా స్పెషల్ రోజు. ఎందుకంటే ఈ రోజు మా నాన్న బర్త్ డే కూడా. చిన్నప్పుడు రెండు వేడుకలను కలిపి చేసుకునేవాళ్లం. ఇండిపెండెన్స్ డే అంటే నాకు ముందుగా మా నాన్నగారే గుర్తుకు వస్తారు..


ఈ దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడానికి ఎందరో తమ ప్రాణాలను త్యాగం చేశారు. ఎంతో గొప్ప చరిత్ర కలిగిన భారతదేశంలో పుట్టినందుకు గర్విస్తున్నా. 

Virat Kohli

నిజానికి మేం ఇండిపెండెన్స్ రోజు చాలా మ్యాచులు ఆడాం. క్రికెట్ ఫీల్డ్‌లో కూడా మాకు చాలా మంచి అనుభవాలు ఉన్నాయి. లండన్‌లో టెస్టు మ్యాచ్‌ సమయంలో ఉదయాన్ని భారత జాతీయ పతకాన్ని ఎగరవేశాం. ఆంగ్లేయుల గడ్డ మీద భారత జెండాని ఎగరవేయడం చాలా చాలా స్పెషల్ మూమెంట్ మాకు..

1983, 2007, 2011

వన్డే వరల్డ్ కప్ గెలిచిన తర్వాత జాతీయ జెండాలతో గ్రౌండ్ అంతా పరుగెత్తడం కూడా ఎప్పటికీ మరిచిపోలేను. జెండాను పట్టుకున్న ప్రతీసారీ నాకు తెలియకుండానే ఒళ్లు జలదరిస్తుంది.. 

ఢిల్లీలో ఆగస్టు 15న మేం పతంగులు ఎగురవేసి, ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాం. దాని కోసం ఎంతో గ్రౌండ్ వర్క్ చేసేవాళ్లం. అంతకుముందు రోజు పతంగులు, మాంజా, ఇంకా కావాల్సినవన్నీ తెచ్చి పెట్టుకునేవాళ్లం...’ అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా మాజీ కెప్టెన్, క్రికెటర్ విరాట్ కోహ్లీ...
 

విరాట్ కోహ్లీ తండ్రి ప్రేమ్ కోహ్లీ, 2006 డిసెంబర్ 18న గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు. తండ్రి చనిపోయిన రోజునే తన జెర్సీ నెంబర్‌గా పెట్టుకున్నాడు విరాట్ కోహ్లీ.. 

Latest Videos

click me!