సక్సెస్ కావాలంటే సిక్స్ ప్యాక్‌ ఉండాల్సిన పనిలేదు... పాక్ యంగ్ క్రికెటర్ ఆజమ్ ఖాన్‌కి డుప్లిసిస్ సపోర్ట్...

First Published Jun 6, 2021, 5:19 PM IST

ఫిట్‌నెస్ మెయింటైన్ చేయడంతో పాక్ క్రికెటర్లు చాలా బద్ధకస్తులు. ఆ జట్టు నుంచి వచ్చిన ఇంజమామ్ ఉల్ హక్, సర్ఫరాజ్ అహ్మద్ వంటి కెప్టెన్లు కూడా ఏనాడూ ఫిట్‌నెస్ మెయింటైన్ చేసింది లేదు. ఈ లిస్టులోనే చేరాడు యంగ్ సెన్సేషనల్ హిట్టర్ ఆజమ్ ఖాన్. 

పాక్ సూపర్ లీగ్‌లో క్వెట్టా గ్లాడియేటర్స్ తరుపున రాణించిన ఆజమ్ ఖాన్, టీ20 క్రికెట్‌లో మంచి హిట్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. దీంతో అతన్ని ఇంగ్లాండ్ టూర్‌తో పాటు విండీస్ టూర్‌కి ప్రకటించిన జట్టులో చోటు కల్పించింది పాక్ క్రికెట్ బోర్డు.
undefined
అయితే పీసీబీ తీసుకున్న నిర్ణయాన్ని చాలామంది క్రికెట్ ఫ్యాన్స్ స్వాగతించడం లేదు. పాక్ మాజీ వికెట్ కీపర్ మొయిన్ ఖాన్ కొడుకు అయిన ఆజమ్ ఖాన్‌కు ఏ మాత్రం ఫిట్‌నెస్ లేకపోయినా, జట్టుకి ఎంపిక చేయడంతో నెపోటిజాన్ని ప్రోత్సాహిస్తున్నారంటూ చర్చ జరుగుతోంది.
undefined
ఇప్పటికే పాక్ క్రికెట్ జట్టులో చోటు దక్కించుకున్న ఉమర్ అక్మల్, అద్నాన్ అక్మల్, మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ సోదరులు కాగా షాహిదీ అఫ్రిదీ తమ్ముడు రియాజ్ అఫ్రిదీ, అల్లుడు షాహిదీ అఫ్రిదీ... అలాగే సల్మాన్ భట్, అతని తమ్ముడు ఇమ్రాన్ భట్ కూడా పాక్ టీమ్‌కి ఆడారు. ఇలా మాజీ క్రికెటర్ల అండతో జట్టులోకి వచ్చినవాళ్లు చాలామందే ఉన్నారు.
undefined
అయితే ఆజమ్ ఖాన్ విషయంలో నెపోటిజం కామెంట్లు రావడానికి కారణం అతని వెయిట్. 22 ఏళ్ల ఆజమ్ ఖాన్ 100 కిలోలకు పైగా బరువు ఉంటాడు. అయితే ఈ మధ్యే బరువు తగ్గడంపై కాస్త ఫోకస్ పెట్టిన ఆజమ్ ఖాన్, కొద్దికొద్దిగా ఆ రిజల్ట్ చూపిస్తున్నాడు.
undefined
‘క్రికెట్‌లో సక్సెస్ కావాలంటే సిక్స్ ప్యాక్ అవసరం లేదు. ఆజమ్ ఖాన్ చాలా మంచి హిట్టర్. అతనితో కలిసి ఆడినప్పుడు ఆజమ్ ఖాన్ హిట్టింగ్ చూసి నేనే ఆశ్చర్యపోయా. అతనిలో చాలా టాలెంట్ ఉంది.
undefined
బంతిని బలంగా బాదగల శక్తి, టైమింగ్‌తో పాటు టెక్నిక్ కూడా అతనికి తెలుసు. అతను ఏమేం చేయగలడో మున్ముందు మీరే చూస్తారు. గత సీజన్‌లో అతను అదరగొట్టాడు....’ అంటూ చెప్పుకొచ్చాడు సౌతాఫ్రికా క్రికెటర్, క్వెట్టా గ్లాడియేటర్స్ జట్టు ప్లేయర్ ఫాఫ్ డుప్లిసిస్.
undefined
తన గురించి చేసిన విమర్శలను తాను పాజిటివ్‌గా తీసుకుంటానని, తాను తన బ్యాటుతోనే వాటికి సమాధానం చెబుతానని చెప్పాడు ఆజమ్ ఖాన్. ‘నేను ఈ విమర్శల్ని పెద్దగా పట్టించుకోను. నా గురించి వాళ్లేం మాట్లాడారో నాకు తెలుసు. అయితే వాటికి నా బ్యాటుతోనే సమాధానం చెబుతా. నాకంటూ కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. వాటిని సాధించడంపైనే నా ఫోకస్ పెడతా’ అంటూ చెప్పుకొచ్చాడు ఆజమ్ ఖాన్.
undefined
click me!