కోహ్లీ కాదు, ఇప్పటికీ టీమిండియాకి అతనే బెస్ట్ బ్యాట్స్‌మెన్... గౌతమ్ గంభీర్ కామెంట్..

First Published | Oct 29, 2022, 10:00 AM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో వరుసగా రెండు హాఫ్ సెంచరీలు చేసి టీమిండియా తరుపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఉన్నాడు విరాట్ కోహ్లీ. పాకిస్తాన్‌పై వన్ ఆఫ్ ది కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీ, నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ హాఫ్ సెంచరీ బాదాడు. అయితే గౌతమ్ గంభీర్ మాత్రం విరాట్ బెస్ట్ బ్యాటర్ కాదని అంటున్నాడు...

Not Virat Kohli, SuryaKumar Yadav best batsman for Team India, Says Gautam Gambhir
Gautam Gambhir

గౌతమ్ గంభీర్‌కీ, విరాట్ కోహ్లీకి మధ్య ఐపీఎల్ 2013 సమయంలో గొడవ జరిగింది. అంతకుముందు 2009లో శ్రీలంకతో మ్యాచ్‌లో తనకి వచ్చిన ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును విరాట్‌తో షేర్ చేసుకున్నాడు గౌతమ్ గంభీర్. అయితే ఐపీఎల్ గొడవ తర్వాత విరాట్ కోహ్లీకి, గంభీర్‌కి అస్సలు పడడం లేదు...

Not Virat Kohli, SuryaKumar Yadav best batsman for Team India, Says Gautam Gambhir
Virat Kohli-Suryakumar Yadav

పేలవ ఫామ్‌తో విరాట్ కోహ్లీ ఇబ్బంది పడుతున్న సమయంలో అతనికి టీ20ల్లో చోటు ఇవ్వడమే అనవసరమని సూచించిన గౌతమ్ గంభీర్, ఐపీఎల్ రికార్డుల కారణంగా రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఇవ్వాలని డిమాండ్ చేసిన వారిలో ఒకడు.. 


Image credit: Getty

‘టీమ్‌లో సూర్యకుమార్ యాదవ్ కంటే బెటర్ ప్లేయర్ ఎవ్వరూ లేరు. కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల మాదిరిగా పవర్ ప్లేలో బ్యాటింగ్ చేసే సదుపాయం సూర్యకుమార్ యాదవ్‌కి లేదు. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసేటప్పుడు ఫీల్డర్లు బౌండరీ దగ్గర ఉంటారు...
 

అలాంటి సమయంలో క్రీజులోకి వచ్చి బౌండరీలు బాదడం అంటే మామూలు విషయం కాదు. వచ్చి రాగానే సిక్సర్ కొట్టగల సత్తా సూర్యకుమార్ యాదవ్‌కి ఉంది. విరాట్ కోహ్లీ కానీ కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ ఇలా చేయలేరు...

Image credit: PTI

భారత బ్యాటింగ్ ఆర్డర్‌లో సూర్యకుమార్ యాదవ్ ఒక్కడే మిగిలిన బ్యాటర్ల నుంచి ప్రెషర్‌ని తొలగించగలడు. అందుకే అతనే బెస్ట్ బ్యాటర్. సూర్యకుమార్ యాదవ్ వచ్చీ రాగానే బౌండరీలు కొట్టడం వల్లే విరాట్ కోహ్లీ ప్రెషర్ పోయి, ఫ్రీగా ఆడగలిగాడు. కోహ్లీ మంచి ప్లేయరే కావచ్చు... సూర్యకంటే బెస్ట్ బ్యాటర్ మాత్రం కాదు...

సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా పరుగులు చేస్తే టీమిండియా వరల్డ్ కప్ గెలవడం కష్టమేమీ కాదు. టాప్ 3లో ఉన్న బ్యాటర్లు హాఫ్ సెంచరీలు చేస్తారు, సెంచరీలు కొడతారు. అయితే నాలుగు, ఐదో స్థానంలో ఉన్న సూర్యకుమార్, హార్ధిక్ పాండ్యా ఆడే ఇన్నింగ్స్‌లే మ్యాచ్‌లను మలుపు తిప్పుతాయి...’ అంటూ చెప్పుకొచ్చాడు భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్.. 

Latest Videos

click me!