వాళ్లు క్యాచ్ మిస్ చేస్తే చాలు... ఆ బ్యాట్స్‌మెన్ చెలరేగిపోతారంతే... ఐపీఎల్ 2021లో కొత్త సెంటిమెంట్...

First Published Apr 28, 2021, 4:09 PM IST

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఐపీఎల్ 2021 సీజన్‌లో మళ్లీ టాప్‌లోకి దూసుకెళ్లింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 1 పరుగు తేడాతో గెలిచి, ఊపిరి పీల్చుకుంది. అయితే నేటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై సీఎస్‌కే గెలిస్తే, ఒక్క రోజుకే ఆర్‌సీబీ టాప్‌ లేచిపోద్ది...

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తృటిలో ఓటమి నుంచి తప్పించుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు ఓ వింత సెంటిమెంట్ పట్టుకుంది. దీనికి కారణం షిమ్రాన్ హెట్మయర్ మెరుపు ఇన్నింగ్స్...
undefined
ఐపీఎల్ 2021 సీజన్‌లో హెట్మయర్ ఇప్పటిదాకా పెద్దగా మెరుపులు మెరిపించింది లేదు. అంతకుముందు 3 మ్యాచులు ఆడిన హెట్మయర్ కేవలం 15 పరుగులు మాత్రమే చేశాడు. అయితే ఆర్‌సీబీ చెలరేగిపోయాడు.
undefined
జెమ్మిసన్ బౌలింగ్‌లో హెట్మయర్ ఇచ్చిన క్యాచ్‌ను దేవ్‌దత్ పడిక్కల్ జారవిడిచాడు. అప్పటికి హెట్మయర్ స్కోరు కేవలం 10 పరుగులు మాత్రమే. వస్తూనే ఓ సిక్సర్, ఫోర్ బాదిన హెట్మయర్‌ ఇచ్చిన క్యాచ్‌ను పడిక్కల్ ఒడిసిపట్టుకునే ఉంటే, మ్యాచ్‌పై ఆర్‌సీబీ ఎప్పుడో పట్టుసాధించి ఉండేది.
undefined
పడిక్కల్ ఇచ్చిన లైఫ్‌తో చెలరేగిపోయిన హెట్మయర్, జెమ్మిసన్ వేసిన 17వ ఓవర్‌లో ఏకంగా మూడు సిక్సర్లతో 21 పరుగులు రాబట్టి... 25 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 53 పరుగులు పూర్తిచేసుకున్నాడు.
undefined
19వ ఓవర్ వేసిన హర్షల్ పటేల్, 20వ ఓవర్ వేసిన సిరాజ్ కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడం వల్ల హెట్మయర్ భారీ షాట్లు ఆడలేకపోయాడు కానీ ఆఖరి రెండు బంతుల్లో అతనికి స్ట్రైయికింగ్ వచ్చి ఉంటే, మ్యాచ్ రిజల్టే మారిపోయేది.
undefined
అంతకుముందు మ్యాచ్‌లో కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది రాయల్ ఛాలెంజర్స్‌కి. రవీంద్ర జడేజా సున్నా దగ్గర ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ లైన్ దగ్గర డానియల్ క్రిస్టియన్ వదిలేశాడు. ఈ లైఫ్‌తో రెచ్చిపోయిన రవీంద్ర జడేజా, హర్షల్ పటేల్ వేసిన 20వ ఓవర్‌లో ఏకంగా 37 పరుగులు రాబట్టాడు.
undefined
5 సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 28 బంతుల్లోనే 62 పరుగులు చేసిన రవీంద్ర జడేజా ఇన్నింగ్స్, ఆర్‌సీబీ మనోధైర్యాన్ని బాగా దెబ్బతీసింది. ఫలితంగా ఆ మ్యాచ్‌ కాస్తా సీఎస్‌కే చేతికి వెళ్లిపోయింది...
undefined
అంతకుముందు నాలుగు మ్యాచులు ఆడినా బ్యాటుతో పెద్దగా చెప్పుకోదగిన ఇన్నింగ్స్ ఆడలేకపోయిన రవీంద్ర జడేజా, ఆర్‌సీబీ ఫీల్డర్ క్యాచ్ డ్రాప్ చేశాక ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.
undefined
దీంతో ఆర్‌సీబీ ఫీల్డర్లు క్యాచ్ డ్రాప్ చేస్తే చాలు, ఆ బ్యాట్స్‌మెన్ అదరగొడతాడని సెంటిమెంట్ బాగా వినిపిస్తోంది. ఈ సెంటిమెంట్ సంగతి ఎలా ఉన్నా క్యాచులు డ్రాప్ చేయడం వల్ల ఓ మ్యాచ్ కోల్పోయి, మరో మ్యాచ్‌లో ఓటమి అంచుల దాకా వెళ్లి వచ్చిన ఆర్‌సీబీ, ఇప్పటికైనా ఫీల్డింగ్‌పైన ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.
undefined
click me!