నా పర్ఫామెన్స్ నాకే నచ్చడం లేదు, ఇక వాళ్లకేం నచ్చుతుంది... పృథ్వీషా కామెంట్...

Published : Mar 10, 2022, 01:22 PM IST

టన్నుల్లో టాలెంట్ ఉన్నా, దాన్ని సరిగ్గా వాడుకోవడం తెలియని ప్లేయర్లలో పృథ్వీషా ఒకడు. టీమిండియాలోకి సంచలనంలా దూసుకొచ్చిన పృథ్వీషా, అంత స్పీడ్‌గా జట్టులో చోటు కోల్పోయాడు. రంజీ ట్రోఫీ 2022లో ముంబైకి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న పృథ్వీషా, తన పర్ఫామెన్స్ తనకే నచ్చడం లేదంటున్నాడు.

PREV
110
నా పర్ఫామెన్స్ నాకే నచ్చడం లేదు, ఇక వాళ్లకేం నచ్చుతుంది... పృథ్వీషా కామెంట్...

టీమిండియా తరుపున ఆడిలైడ్ టెస్టులో బరిలో దిగిన పృథ్వీషా, రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 4 పరుగులే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. ఆ టెస్టు తర్వాత భారత జట్టులో చోటు కోల్పోయాడు... 

210

శ్రీలంకలో పర్యటించిన శిఖర్ ధావన్ టీమ్‌లో పృథ్వీషాకి టీ20, వన్డే జట్టులో అవకాశం దక్కినా... దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడు... కరోనా వల్ల ఆఖరి రెండు టీ20లు ఆడలేకపోయాడు...

310

ఇంగ్లాండ్‌ టూర్‌లో ఐదో టెస్టు కోసం పృథ్వీషాను రప్పించుకున్నా, భారత బృందంలో కరోనా కేసులు వెలుగుచూడడంలో భారత్, ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన ఐదో టెస్టు వాయిదా పడిన విషయం తెలిసిందే...

410

భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్నప్పటికీ దేశవాళీ టోర్నీల్లో మంచి పర్ఫామెన్స్‌ కనబరుస్తున్న పృథ్వీషా... సౌతాఫ్రికాలో పర్యటించిన భారత్ ఏ జట్టులోనూ సభ్యుడిగా ఉన్నాడు...

510

అయితే రంజీ ట్రోఫీ 2022 సీజన్‌లో మాత్రం పృథ్వీ షా బ్యాటు నుంచి ఇప్పటిదాకా సరైన ఇన్నింగ్స్ ఒక్కటి కూడా రాలేదు. మూడు ఇన్నింగ్స్‌ల్లో 9, 44, 53 పరుగులు చేసి నిరాశపరిచాడు పృథ్వీ షా...

610

‘రంజీ ట్రోఫీలో నా పర్ఫామెన్స్‌, నాకే నచ్చడం లేదు. నేను ఇంతకంటే బాగా రాణించగలను. 40-50 పరుగులు చేయడం వల్ల పెద్దగా లాభం ఉండదు... 

710

అయితే ఇంకా సమయం ఉంది. బ్యాటింగ్ బాగానే చేస్తున్నా, అయితే భారీ స్కోరు చేయలేకపోతున్నా. త్వరలోనే నా బ్యాటు నుంచి భారీ స్కోరు వస్తుందనే సంకేతాలు అందుతున్నాయి...

810

ఐపీఎల్ వల్ల రంజీ ట్రోఫీకి రెండున్నర నెలల పాటు బ్రేక్ దొరకనుంది. అందరి ఫోకస్ రంజీ నుంచి ఐపీఎల్‌కి మారుతుంది. కాబట్టి ఐపీఎల్ అయిన తర్వాత వెంటనే రెడ్ బాల్ క్రికెట్‌పై ఫోకస్ పెడతాను...’ అంటూ కామెంట్ చేశాడు పృథ్వీషా...

910

ఐపీఎల్ 2022 సీజన్‌లో డేవిడ్ వార్నర్‌తో కలిసి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి ఓపెనింగ్ చేయబోతున్నాడు పృథ్వీషా... ఢిల్లీ తొలి మ్యాచ్ మార్చి 27న ముంబై ఇండియన్స్‌తో ఆడనుంది...

1010

41 సార్లు రంజీ ట్రోఫీ గెలిచిన ముంబై జట్టు, ఎలైట్ గ్రూప్ డీలో టాపర్‌గా నిలిచి నాకౌట్‌ మ్యాచులకు అర్హత సాధించింది. ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ 3 మ్యాచుల్లో 551 పరుగులు చేసి అదరగొట్టాడు. 

click me!

Recommended Stories