ఐపీఎల్ కాంట్రాక్ట్ ఉన్న ఒకే ఒక్కడు, సెంచరీ కొట్టాడు... జానీ బెయిర్ స్టో సెంచరీతో ఇంగ్లాండ్ మాజీలపై...

Published : Mar 10, 2022, 11:34 AM IST

యాషెస్ సిరీస్‌ 2021-22 టోర్నీలో కనీసం ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయిన ఇంగ్లాండ్, ఆతిథ్య ఆస్ట్రేలియా టీమ్‌కి టఫ్ కాంపిటీషన్ కూడా ఇవ్వలేకపోయింది. చచ్చీ చెడీ ఒక్క టెస్టును డ్రా చేసుకున్న ఇంగ్లాండ్, ప్రస్తుతం వెస్టిండీస్‌లో పర్యటిస్తోంది...

PREV
111
ఐపీఎల్ కాంట్రాక్ట్ ఉన్న ఒకే ఒక్కడు, సెంచరీ కొట్టాడు...  జానీ బెయిర్ స్టో సెంచరీతో ఇంగ్లాండ్ మాజీలపై...

వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ జట్టు 311 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఓపెనర్లతో పాటు మిడిల్ ఆర్డర్‌ కూడా విఫలమైంది...

211

గత ఏడాది టెస్టుల్లో 1700+ పరుగులు చేసి రికార్డు క్రియేట్ చేసిన ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ జో రూట్ 13 పరుగులు చేసి అవుట్ కాగా లారెన్స్ 20, బెన్ స్టోక్స్ 36 పరుగులు చేసి పెవిలియన్ చేరారు...

311

115 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్‌ని జానీ బెయిర్ స్టో అద్భుత శతకంతో ఆదుకున్నాడు. 259 బంతుల్లో 21 ఫోర్లతో 140 పరుగులు చేశాడు బెయిర్ స్టో...

411

బెన్ ఫోక్స్‌తో కలిసి ఆరో వికెట్‌కి 99 పరుగులు, క్రిస్ వోక్స్‌తో కలిసి ఏడో వికెట్‌కి 71 పరుగులు జోడించిన బెయిర్ స్టో... బెన్ స్టోక్స్‌తో కలిసి నాలుగో వికెట్‌కి 67 పరుగులు జోడించాడు...

511

జానీ బెయిర్ స్టో సెంచరీతో ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్‌ను, మాజీ క్రికెటర్లను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. యాషెస్ సిరీస్ ఓటమి తర్వాత ఇంగ్లాండ్ జట్టు ఓటమికి ఐపీఎల్‌ని కారణంగా చూపించారు చాలామంది మాజీ క్రికెటర్లు...

611

ఐపీఎల్ వల్ల ఇంగ్లాండ్ క్రికెటర్లు ప్రాక్టీస్ సెషన్స్‌కి సరిగా అందుబాటులో ఉండడం లేదని, అందుకే ఓడిపోయామని ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ జో రూట్ కామెంట్ చేశాడు....

711

స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌తో పాటు జో రూట్ కూడా ఈ విమర్శల కారణంగానే ఐపీఎల్ 2022 మెగా సీజన్‌కి పేర్లను రిజిస్టర్ చేయించుకోలేదు...

811

అయితే వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో జట్టులో ఉన్న ఒకే ఒక్క ఐపీఎల్ ప్లేయర్ జానీ బెయిర్ స్టో... సెంచరీతో చెలరేగితే, మిగిలిన ప్లేయర్లు ఎవ్వరూ 50+ స్కోరు కూడా చేయలేకపోయారని గుర్తుచేస్తున్నారు ఐపీఎల్ ఫ్యాన్స్..

911

భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా ‘బెయిర్ స్టో, ఐపీఎల్ ఆడుతున్నాడు కదా...’ అంటూ ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ల కామెంట్లకు కౌంటర్ ఇచ్చాడు...

1011

మీ చేతకాని తనాన్ని ఐపీఎల్‌పై వేసి, చేతులు దులుపుకోవాలని చూసిన ఇంగ్లాండ్ జట్టుకి బెయిర్ స్టో సెంచరీ... విండీస్‌పై పరాభవాన్ని తప్పించినా, టీమిండియా ఫ్యాన్స్ నుంచి ట్రోల్స్ రావడానికి కారణమైంది...

1111

సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున మూడు సీజన్లు ఆడిన జానీ బెయిర్ స్టోని రూ.6.75 కోట్లకు మెగా వేలంలో కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్... 

click me!

Recommended Stories