ధోనీ కాదు, రోహిత్ శర్మ! ఆరేళ్ల క్రితం రవిచంద్రన్ అశ్విన్‌తో విరాట్ కోహ్లీ కామెంట్స్...

First Published | Sep 14, 2023, 2:30 PM IST

14 ఏళ్ల అంతర్జాతీయ అనుభవం తర్వాత మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ దక్కించుకున్నాడు రోహిత్ శర్మ. ఆసియా కప్ 2023 టోర్నీలో సూపర్ 4 రౌండ్‌లో వరుసగా రెండు విజయాలు అందుకున్న భారత జట్టు, ఫైనల్‌కి దూసుకెళ్లింది..
 

Kohli-Rohit hug

పాకిస్తాన్‌తో సూపర్ 4 మ్యాచ్‌లో 228 పరుగుల భారీ తేడాతో విజయం అందుకున్న భారత జట్టు, శ్రీలంకతో జరిగిన లో స్కోరింగ్ థ్రిల్లర్‌లో 41 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. బ్యాటింగ్‌కి కష్టంగా ఉన్న పిచ్‌పై రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు..

Rohit Sharma captain

వరుసగా 14 వన్డేలు గెలిచి, వరల్డ్ రికార్డు సాధించిన శ్రీలంక జట్టు జైత్రయాత్రకి బ్రేక్ వేసింది టీమిండియా. ఈ మ్యాచ్ తర్వాత తన యూట్యూబ్ ఛానెల్‌లో రోహిత్ శర్మ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు రవిచంద్రన్ అశ్విన్..

Latest Videos


‘5-6 ఏళ్ల కిందట రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తుంటే నేను, విరాట్ కోహ్లీ కలిసి బాల్కనీలో మాట్లాడుకుంటున్నాం. ఆ మ్యాచ్ ఏదో నాకైతే గుర్తు లేదు కానీ రోహిత్ శర్మ బ్యాటింగ్ చూస్తూ, అతనికి ఎక్కడ బౌలింగ్ వేస్తే అవుట్ చేయొచ్చా? అని ఆలోచిస్తున్నా..

రోహిత్ శర్మ 15-20 ఓవర్లు క్రీజులో సెటిల్ అయితే, ఆ తర్వాత అతన్ని అవుట్ చేయడం చాలా కష్టమైపోతుంది. చాలా డేంజరస్‌ బ్యాటర్‌గా మారిపోతాడు. 
 

 నా పక్కనే ఉన్న విరాట్ కోహ్లీ, ‘‘డెత్ ఓవర్లలో కెప్టెన్‌‌ని భయపెట్టే బ్యాటర్ ఎవరో తెలుసా?’’ అంటూ అడిగాడు. దానికి నేను వెంటనే ‘‘ధోనీయా?’’ అని అడిగాను..

దానికి విరాట్, ‘‘లేదు, రోహిత్ శర్మ...’’ అన్నాడు. ఎందుకు? అని అడిగా. ‘‘రోహిత్ శర్మ డెత్ ఓవర్ల దాకా బ్యాటింగ్ చేస్తే, మోస్ట్ డేంజరస్ బ్యాటర్‌గా మారతాడు. అతనికి ఎక్కడ బౌలింగ్ చేయాలో ఏ బౌలర్‌కీ అర్థం కాదు...’’ అంటూ చెప్పాడు. నాకు నిజమేనని అనిపించింది..

టీ20ల్లో రోహిత్ శర్మ 16వ ఓవర్ దాకా క్రీజులో ఉంటే, టీమ్ స్కోరు ఈజీగా 200 దాటిపోయి ఉంటుంది. దాటకపోతే, మిగిలిన 4 ఓవర్లలో అతను దాన్ని చేసి చూపిస్తాడు. క్రికెట్ పుస్తకంలో ఉండే అన్నిరకాల షాట్స్ అతని దగ్గర ఉన్నాయి..

rohit kohli

చిన్నస్వామి స్టేడియంలో రోహిత్ శర్మ ఆడిన అత్యద్భుత ఇన్నింగ్స్‌ని విరాట్ కోహ్లీ ఎప్పటికీ మరిచిపోలేడు. ఏ మాత్రం కష్టపడకుండా చాలా ఈజీగా షాట్స్ ఆడడం రోహిత్ శర్మ స్పెషాలిటీ...’ అంటూ తన యూట్యూబ్ ఛానెల్‌లో చెప్పుకొచ్చాడు భారత క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్.. 

click me!