ధోనీకి అంత సీన్ లేదు! రోహిత్ శర్మనే బెస్ట్ ఐపీఎల్ కెప్టెన్... వీరేంద్ర సెహ్వాగ్ కామెంట్..

First Published Feb 19, 2023, 10:04 AM IST

ఐపీఎల్‌లో మెస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్లు రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోనీ. రోహిత్ శర్మ, 10 సీజన్లలో కెప్టెన్‌గా ఐదు టైటిల్స్ గెలిస్తే, 15 సీజన్లలో నాలుగుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన ఎంఎస్ ధోనీ.. తన టీమ్‌ని 11 సార్లు ప్లేఆఫ్స్ చేర్చాడు..

రికార్డు స్థాయిలో 9 సార్లు ఫైనల్ ఆడిన చెన్నై సూపర్ కింగ్స్, నాలుగు సార్లు విజేతగా నిలిచి, మిగిలిన ఐదు సార్లు రన్నరప్ టైటిల్‌తో సరిపెట్టుకుంది. మరో వైపు రోహిత్ శర్మను కెప్టెన్‌గా నియమించిన తర్వాత ముంబై ఇండియన్స్ రాతే మారిపోయింది..

2013లో మొదటిసారి ఐపీఎల్ టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్, ఆ తర్వాత 2015, 2017 సీజన్లలో ఛాంపియన్‌గా నిలిచింది. 2019, 2020 సీజన్లలో వరుసగా టైటిల్స్ గెలిచి అత్యధిక సార్లు టైటిల్ గెలిచిన టీమ్‌గా నిలిచింది..

Latest Videos


‘రోహిత్ శర్మ కెప్టెన్సీ రికార్డులు చూడండి. ఎంఎస్ ధోనీ, చెన్నై సూపర్ కింగ్స్‌కి కెప్టెన్సీ చేయడానికి ముందే టీమిండియా కెప్టెన్. అప్పటికే కెప్టెన్‌గా టీ20 వరల్డ్ కప్ 2007 కూడా గెలిచాడు...

రోహిత్ శర్మ అలా కాదు. అతన్ని ముంబై ఇండియన్స్‌ అనుకోకుండా కెప్టెన్‌గా ఎంపిక చేసింది. అయితే కెప్టెన్సీ తీసుకున్న మొదటి సీజన్‌లోనే టైటిల్ గెలిచాడు. అది గాలివాటుగా వచ్చింది కాదని ఐదు టైటిల్స్ గెలిచి నిరూపించుకున్నాడు..

ధోనీకి నాలుగు టైటిల్స్ గెలవడానికి 15 సీజన్ల సమయం పడితే, రోహిత్ శర్మ కేవలం 8 సీజన్లలలోనే ఐదు టైటిల్స్ గెలిచాడు. రోహిత్, ఐపీఎల్‌లో బెస్ట్ కెప్టెన్ అనడానికి ఇంతకంటే పెద్ద లెక్కలు అవసరమా...’ అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్..

అయితే ధోనీ, రోహిత్ కెప్టెన్సీలో ఐపీఎల్ ఆడిన హర్భజన్ సింగ్ మాత్రం వీరూ అభిప్రాయంతో అంగీకరించలేదు. ‘రోహిత్, ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచినా, ఐపీఎల్‌లో బెస్ట్ కెప్టెన్ ధోనీయే. ఎందుకంటే అతను మొదటి నుంచి చెన్నైకే ఆడుతున్నాడు...

Image credit: PTI

చెన్నై సూపర్ కింగ్స్ ఓ పటిష్టమైన టీమ్‌గా తయారుచేయడానికి ధోనీ ఎంతో కష్టపడ్డాడు. ప్రతీ ప్లేయర్, సీఎస్‌కే తరుపున ఆడాలని అనుకుంటారు. అదే మాహీ కెప్టెన్సీలో స్పెషాలిటీ. అందుకే నా ఉద్దేశంతో ధోనీయే బెస్ట్ ఐపీఎల్ కెప్టెన్..’ అని చెప్పుకొచ్చాడు హర్భజన్ సింగ్..
 

click me!