ఏడాదికోసారి పాక్ బౌలర్లను ఫేస్ చేస్తే, ఇలాగే ఉంటది! బాబర్ చాలా గొప్ప బ్యాటర్... శుబ్‌మన్ గిల్ కామెంట్స్..

Chinthakindhi Ramu | Published : Sep 9, 2023 9:40 PM
Google News Follow Us

అతి తక్కువ సమయంలోనే టీమిండియాకి త్రీ ఫార్మాట్ ప్లేయర్‌గా మారాడు శుబ్‌మన్ గిల్. వన్డేల్లో నెం.3 బ్యాటర్‌గా ఉన్న శుబ్‌మన్ గిల్, పాకిస్తాన్‌తో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో 10 పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచాడు..
 

18
ఏడాదికోసారి పాక్ బౌలర్లను ఫేస్ చేస్తే, ఇలాగే ఉంటది! బాబర్ చాలా గొప్ప బ్యాటర్... శుబ్‌మన్ గిల్ కామెంట్స్..

నసీం షా ఓవర్‌లో ఒక్క పరుగు కూడా చేయలేకపోయిన శుబ్‌మన్ గిల్, 32 బంతులు ఆడినా 10 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అదే నేపాల్‌తో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు..

28

‘మిగిలిన టీమ్స్‌తో ఆడినట్టుగా మేం పాకిస్తాన్‌తో వరుసగా మ్యాచులు ఆడడం లేదు. ఏడాదికోసారి మాత్రమే వాళ్లతో మ్యాచులు ఆడే అవకాశం వస్తోంది. వాళ్ల బౌలింగ్ యూనిట్ చాలా బాగుంటుందని అందరికీ తెలుసు...

38

పాకిస్తాన్ ఫాస్ట్ బౌలింగ్ లాంటి క్వాలిటీ బౌలింగ్‌ని తరుచుగా ఎదుర్కోకకపోవడం, మెగా టోర్నీమెంట్లలో చాలా మార్పులు తీసుకువస్తుంది. పాకిస్తాన్‌తో వరుసగా మ్యాచులు ఆడుతుంటే, ఇంత ఇబ్బంది ఉండదు...

Related Articles

48
Shubman Gill

షాహీన్ అద్భుతంగా స్వింగ్ చేస్తాడు. నసీం పేస్‌ని అంచనా వేయడం కష్టంగా ఉంటుంది. హారీస్ రౌఫ్ కూడా అంతే. ఏడాదికోసారి పాక్ బౌలర్లను ఫేస్ చేస్తే, ఇలాగే ఉంటది!  ఎలాంటి పరిస్థితుల్లో అయినా బ్యాటర్లను ఇబ్బంది పెట్టేందుకు అవసరమైన బౌలింగ్ యూనిట్, పాక్‌కి ఉంది.. 

58

లెఫ్ట్ ఆర్మ్ త్రో డౌన్ స్పెషలిస్ట్ నువాన్‌‌ని నెట్స్‌లో ఫేస్ చేయడం, లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోవడానికి కాస్త ఉపయోగపడింది.  ఎలాంటి ఛాలెంజ్‌నైనా స్వీకరించడానికి వీలుగా మా ట్రైయినింగ్ ఉంటుంది...

68

ఓపెనర్లుగా శుభారంభం అందించే బాధ్యత మాపై ఉంటుంది. మేం 10 ఓవర్లు ఆడితే, మిడిల్ ఆర్డర్‌ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయగలుగుతుంది. రోహిత్ శర్మ, నా కాంబినేషన్ బాగా వర్కవుట్ అవుతోంది.  

78

పాకిస్తాన్‌ ఫాస్ట్ బౌలింగ్‌ని ఫేస్ చేయడం నాకు ఇదే తొలిసారి. కాబట్టి ప్రెషర్ ఎక్కువగా ఉన్న మాట నిజమే. అయితే పాక్ అయినా, నెదర్లాండ్స్ అయినా ప్రెషర్ ఇలాగే ఉంటుంది.

88

బాబర్ ఆజమ్‌ వరల్డ్ క్లాస్ ప్లేయర్. నేను అతని బ్యాటింగ్ వీడియోలు చూసి చాలా విషయాలు నేర్చుకుంటా. అతన్ని ఎంతగానో అభిమానిస్తా..’ అంటూ కామెంట్ చేశాడు శుబ్‌మన్ గిల్.. 

Read more Photos on
Recommended Photos