విరాట్‌ కోహ్లీని ఎవ్వరూ ఏమీ చేయలేరు, మరో పదేళ్ల తర్వాత...

Published : Mar 11, 2022, 10:19 AM IST

జెట్ స్పీడ్‌తో 70 అంతర్జాతీయ సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ 100 సెంచరీల రికార్డును బ్రేక్ చేసేలా కనిపించాడు. అయితే రన్‌ మెషిన్ నుంచి ఉన్నట్టుండి సెంచరీల మోత ఆగిపోయింది. పరుగులు వస్తున్నా, సెంచరీ మార్కు అందుకోలేకపోతున్నాడు...

PREV
19
విరాట్‌ కోహ్లీని ఎవ్వరూ ఏమీ చేయలేరు, మరో పదేళ్ల తర్వాత...

రెండున్నరేళ్లుగా 71వ సెంచరీని అందుకోవడానికి ఆపసోపాలు పడుతున్న విరాట్ కోహ్లీ, బీసీసీఐ రాజకీయాల కారణంగా కెప్టెన్సీ కూడా కోల్పోయాడు...
 

29

మొహాలీ టెస్టు ద్వారా 100 టెస్టులు పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ నమోదు చేసిన 200 టెస్టుల రికార్డును కూడా బ్రేక్ చేస్తాడని అంటున్నాడు భారత మాజీ క్రికెటర్ అన్షుమాన్ గైక్వాడ్...

39

‘విరాట్ కోహ్లీ తన ఫిట్‌నెస్‌పై చాలా శ్రద్ధ పెడతారు. అతను 200 టెస్టు ఆడినా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు భారత జట్టు వరుస సిరీసులు ఆడుతోంది...

49

గతంతో పోలిస్తే టెస్టు మ్యాచుల సంఖ్య కూడా పెరిగింది. కాబట్టి మరో ఏడు, 8 ఏళ్లు క్రికెట్‌లో కొనసాగినా 200 టెస్టుల మార్కును అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదు...

59

ఇప్పుడున్న ఫిట్‌నెస్‌ని మెయింటైన్ చేస్తే, విరాట్ కోహ్లీ ఈజీగా మరో 10 ఏళ్ల పాటు బ్రేకులు లేకుండా క్రికెట్ ఆడగలడు...

69

ఫిట్‌గా ఉండి, పరుగులు చేస్తున్నంతకాలం విరాట్‌ని ఎవ్వరూ టచ్ చేయలేరు...’ అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్ అన్షుమాన్ గైక్వాడ్...

79

100 టెస్టులు ముగిసే సమయానికి 50.36 సగటుతో 8007 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, టెస్టుల్లో 27 సెంచరీలు నమోదు చేశాడు...

89

అలాగే వన్డే, టీ20 మ్యాచుల్లో కలిసి 357 మ్యాచుల్లో 15,607 పరుగులు చేశాడు. ఇందులో 43 వన్డే సెంచరీలు ఉన్నాయి...

99

సచిన్ టెండూల్కర్‌ వన్డేల్లో 49 సెంచరీలు చేయగా, విరాట్ కోహ్లీ ఆ రికార్డును అధిగమించాలంటే మరో 7 సెంచరీలు చేయాల్సి ఉంటుంది...

Read more Photos on
click me!

Recommended Stories