ఇండియాలో టెస్టు సిరీస్ గెలిచేందుకు ఆస్ట్రేలియా మాస్టర్ ప్లాన్... సిడ్నీలో స్పిన్ పిచ్ తయారుచేసి...

First Published Jan 30, 2023, 12:11 PM IST

ఆస్ట్రేలియా టెస్టుల్లో నెం.1 ఐసీసీ టీమ్. ప్యాట్ కమ్మిన్స్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక్క టెస్టు సిరీస్ కూడా ఓడిపోలేదు ఆస్ట్రేలియా. అయితే ఆసీస్ టీమ్‌కి అసలు పరీక్ష ఇప్పుడే ప్రారంభం కానుంది. వచ్చే నెలలో భారత్‌లో పర్యటించనుంది ఆస్ట్రేలియా జట్టు...

Australia Test Team

1996లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభమైంది. అయితే దీనికి ముందే 49 ఏళ్లలో 50 టెస్టులు ఆడాయి ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా. స్వాతంత్ర్యం తర్వాత భారత్‌లో అడుగుపెట్టిన మొట్టమొదటి పురుషుల క్రికెట్ జట్టు ఆస్ట్రేలియానే...

1996 సీజన్‌కి ముందు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లకు ఇండియా ఆరు సార్లు ఆతిథ్యం ఇవ్వగా ఆస్ట్రేలియా ఆరుసార్లు ఆతిథ్యం ఇచ్చింది. ఇందులో 1979-80 సీజన్‌లో మాత్రమే భారత జట్టు.. సిరీస్ సొంతం చేసుకుంది...
 

ఆస్ట్రేలియా ఏడుసార్లు టెస్టు సిరీస్ గెలవగా నాలుగు సార్లు సిరీస్‌లు డ్రాగా ముగిశాయి. అయితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభమయ్యాక భారత జట్టు ఆధిపత్యం మొదలైంది...

1996-97 నుంచి ఇప్పటిదాకా 15 సార్లు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరగగా భారత జట్టు 9 సార్లు టైటిల్ విజేతగా నిలిచింది. ఆస్ట్రేలియాకి ఐదు సార్లు టైటిల్ దక్కగా 2003-04 సీజన్‌లో టెస్టు సిరీస్ డ్రాగా ముగిసింది...

చివరికి 2004-05 సీజన్‌లో భారత పర్యటనలో 4 టెస్టుల్లో 2 విజయాలు అందుకుని 2-1 తేడాతో బోర్డర్ గవాస్కర్ టెస్టు సిరీస్‌ని కైవసం చేసుకుంది ఆస్ట్రేలియా..

ఆ తర్వాత 2008-09, 2010-11, 2012-13, 2016-17 సీజన్లలో ఇండియాలో పర్యటించిన ఆస్ట్రేలియా జట్టు, సిరీస్ విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది...
 

అదీకాకుండా 2018-19, 2020-21 సీజన్లలో ఆస్ట్రేలియాలో పర్యటించి 2-1 తేడాతో టెస్టు సిరీస్‌లు కైవసం చేసుకుని చరిత్ర క్రియేట్ చేసింది భారత జట్టు. వరుసగా మూడు సార్లు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కైవసం చేసుకుంది భారత జట్టు...

Australia vs India

ఈ సారి టెస్టు సిరీస్ గెలవాలనే లక్ష్యంతో కసిగా ప్రాక్టీస్ చేస్తోంది ఆస్ట్రేలియా జట్టు. భారత్‌లో ఉండే పిచ్‌లు స్పిన్‌కి బాగా అనుకూలిస్తాయి. అందుకే ఆస్ట్రేలియాలో స్పిన్‌కి ఎక్కువగా సహకరించే సిడ్నీ మైదానంలో నెట్ ప్రాక్టీస్ చేస్తోంది ఆస్ట్రేలియా...

పిచ్‌పై పచ్చిక ఏ మాత్రం లేకుండా తీసి వేసి, పగుళ్లు కనిపించేలా ఎండబెట్టి... అచ్చు ఇండియాలో ఉండే పిచ్‌లా సిడ్నీ గ్రౌండ్‌ని తయారుచేసింది ఆస్ట్రేలియా. దీంతో ఈసారి భారత స్పిన్నర్ల బౌలింగ్ ఎదుర్కోవడానికి ఆసీస్ బ్యాటర్లు ఇబ్బంది పడబోరని అంచనా వేస్తోంది క్రికెట్ ఆస్ట్రేలియా...
 

వాస్తవానికి గత ఏడాది అక్టోబర్- నవంబర్‌లో ఇండియా - ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ జరగాల్సింది. అయితే టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ కారణంగా ఫిబ్రవరికి వాయిదా పడింది. ఈ పరిస్థితులు ఆసీస్‌కి కలిసి వస్తాయా? లేక భారత్‌కి ఉపయోగపడతాయా? అనేది మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.. 

click me!