గంభీర్ పొగిడాడు, లంక ఓడింది! గౌతీ పవర్ ఇంకా తగ్గలేదంటూ ట్రోల్స్... టీ20 వరల్డ్ కప్ 2022లో...

First Published | Oct 16, 2022, 5:07 PM IST

అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత క్రికెట్ విశ్లేషకుడిగా మారాడు భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్. టీ20 వరల్డ్ కప్ 2007, వన్డే వరల్డ్ కప్ 2011 విజయాల్లో కీలక పాత్ర పోషించిన గౌతీ, క్రికెట్ ఎక్స్‌పర్ట్‌గా మాత్రం మంచి పేరు సంపాదించుకోలేకపోయాడు. దీనికి కారణం గౌతీ ఎవరు గెలుస్తారని చెబితే, ఆ జట్టు కచ్ఛితంగా ఓడిపోతూ రావడమే...

ఐపీఎల్ 2020 సీజన్ సమయం నుంచే గౌతమ్ గంభీర్ సెంటిమెంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ వస్తోంది. గంభీర్ ఏ టీమ్ గెలుస్తుందని చెబితే, ఆ జట్టు కచ్ఛితంగా ఓడిపోతూ రావడం జరిగాయి. ఒకటి రెండు సందర్భాల్లో తప్పితే గౌతీ వేసిన అంచనా ప్రతీసారీ తప్పుతూ వచ్చింది...

విరాట్ కోహ్లీ ఇరగదీస్తాడని చెప్పిన మ్యాచుల్లో అతను డకౌట్ కావడం, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, శార్దూల్, హర్షల్ పటేల్... ఇలామ్యాచ్ విన్నర్లుగా మారతారని  గౌతమ్ గంభీర్ అంచనా వేసిన ప్రతీ ఒక్కరూ ఆయా మ్యాచుల్లో అట్టర్ ఫ్లాప్ అవుతూ వచ్చారు.. 
 


తాజాగా టీ20 వరల్డ్ కప్ 2022 విషయంలోనూ ఇదే జరిగింది. ‘శ్రీలంక జట్టు, ఆసియా కప్ 2022 గెలిచి టీ20 వరల్డ్ కప్‌కి వస్తోంది. వాళ్ల ప్లాన్స్ వాళ్లకి ఉన్నాయి. లంక జట్టు మునుపటి వైభవాన్ని అందుకునేలా కనిపిస్తోంది. దుస్మంత ఛమీరా, లహిరు కులశేఖర రాకతో పూర్తి బలంగా తయారైంది..

sri lanka

నా అంచనా ప్రకారం టీ20 వరల్డ్ కప్‌లో శ్రీలంక జట్టు, ఫెవరెట్ టీమ్స్‌కి షాక్ ఇస్తుంది. ఆసియా కప్ 2022 టోర్నీలో ఇండియా, పాకిస్తాన్ వంటి టాప్ టీమ్స్‌ని లంక ఓడించిన విధానాన్ని మరిచిపోకూడదు... ’ అంటూ కామెంట్ చేశాడు గౌతమ్ గంభీర్...

గంభీర్ ఇలా పొగిడాడో లేదో, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో పసికూన నమీబియా చేతుల్లో 55 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది శ్రీలంక. సీనియర్లు రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత వరుస విజయాలు అందుకోవడానికి కష్టపడుతున్నా, లంక మరీ ఇంత చెత్తగా అసోసియేట్ టీమ్ చేతుల్లో ఓడలేదు...

ఆసియా కప్ టైటిల్ విజేతగా టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీని ఆరంభించిన శ్రీలంక జట్టుకు, మొదటి మ్యాచ్‌లోనే ఊహించని షాక్‌ తగిలింది. గౌతమ్ గంభీర్ పొగడడం వల్లే లంక జట్టు పరిస్థితి ఇలా తయారయ్యిందని మీమ్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి... 

KL Rahul-Gautam Gambhir

దయచేసి టీమిండియా గురించి, బ్యాటర్ల గురించి కానీ మరీ ముఖ్యంగా భారత బౌలర్ల గురించి గౌతమ్ గంభీర్ ఇలా పొగడ్తలు గుప్పించకపోతే అదే పది వేలు అంటూ కామెంట్లు పెడుతున్నారు. టీమిండియా మ్యాచులు ఉన్న సమయంలో మాత్రం గౌతీ తన ప్రెడిక్షన్‌ను పక్కనబెట్టాలని సూచిస్తున్నారు.

Latest Videos

click me!