టీ20 వరల్డ్ కప్ 2022లో ప్లేయింగ్ ఎలెవన్‌ని తాను ఎప్పుడో డిసైడ్ అయ్యానంటూ కామెంట్ చేశాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. అంటే బుమ్రా ప్లేస్‌లో ఎవరిని ఆడించాలో రోహిత్‌కి ఎప్పుడో క్లారిటీ వచ్చింది... తాజాగా భారత క్రికెటర్ రాబిన్ ఊతప్ప ఈ విషయం గురించి కామెంట్ చేశాడు...
‘బుమ్రా ప్లేస్‌లో అర్ష్‌దీప్ సింగ్‌కి అవకాశం ఇవ్వాలి. హార్ధిక్ పాండ్యాకి తుదిజట్టులో తప్పక చోటు ఉంటుంది. అతనితో ఎంత మంది ఫాస్ట్ బౌలర్లను ఆడించాలనే దానిపై ఆధారపడి భారత జట్టు మార్పులు చేస్తుంది...
రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్లతో పోలిస్తే లెఫ్ట్ హ్యాండ్ బౌలర్‌ని ఆడించడమే చాలా మంచి ప్లాన్ అవుతుంది. అర్ష్‌దీప్ సింగ్ చాలా చక్కగా బౌలింగ్ చేస్తున్నాడు. కొత్త బంతితోనే కాకుండా డెత్ ఓవర్లలో కూడా అర్ష్‌దీప్ సింగ్ చక్కగా రాణించగలడు..
arshdeep
నా వరకైతే భువీ, షమీ, అర్ష్‌దీప్ సింగ్‌లతో పాటు హార్ధిక్ పాండ్యా ఉంటే సెట్ అవుతుందని అనిపిస్తుంది. మహ్మద్ షమీకి అపారమైన అనుభవం ఉంది. అతను ఈ ఏడాది అంతర్జాతీయ టీ20 మ్యాచులు ఆడలేదేమో కానీ ఐపీఎల్ ఆడాడు, టెస్టు, వన్డేల్లో బౌలింగ్ చేశాడు...
బౌలింగ్ స్టాఫ్‌తో కూర్చొని చర్చించి, వికెట్లు త్వరగా రావడానికి, టీ20లకు కావాల్సిన రిథమ్ అందుకోవడానికి ఏం చేయాలో మహ్మద్ షమీకి బాగా తెలుసు... టీమ్ కాంబినేషన్ విషయంలో రోహిత్ అండ్ టీమ్‌కి ఎలాంటి అనుమానాలు లేవనుకుంటా...
Mohammed Shami
వాళ్లు ఫుల్లు క్లారిటీతో ఉన్నారు. బయటి నుంచి చూసేవాళ్లకి మాత్రమే జట్టులో కంఫ్యూజన్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇలాంటి విషయాలను ఎలా మ్యానేజ్ చేయాలో రోహిత్ శర్మ, రాహుల్ ద్రావిడ్‌లకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా క్రికెటర్ రాబిన్ ఊతప్ప..