SRH టీం‌లో హైదరాబాద్ ప్లేయర్లు ఎందుకు లేరు... సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్ మీర్జా అసంతృప్తి...

First Published Apr 15, 2021, 6:29 PM IST

పేరుకే సన్‌రైజర్స్ హైదరాబాద్ అయినా, ఎస్‌ఆర్‌హెచ్‌లో తెలుగు ప్లేయర్లు నామమాత్రానికి కూడా ఒక్కరు కూడా లేరు. ఉన్న ఇద్దరు యువ ప్లేయర్లను కూడా ఐపీఎల్ 2021 వేలానికి విడుదల చేసింది ఎస్‌ఆర్‌హెచ్. దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్ మీర్జా...

ఐపీఎల్ 2021 సీజన్‌ను వరుసగా రెండు పరాజయాలతో ప్రారంభించింది సన్‌రైజర్స్ హైదరాబాద్. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో పోరాడి ఓడినా, ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో చేజేతులా పరాజయం పాలైంది...
undefined
‘ఐపీఎల్ 2021 సీజన్ కోసం హైదరాబాద్‌ను వేదికగా ఎంపిక చేయకపోవడం చాలా బాధేసింది... ఎస్‌ఆర్‌హెచ్‌లో ఒక్క లోకల్ ప్లేయర్ కూడా లేకపోవడం చూసి మరింత బాధేసింది...
undefined
ముంబై వంటి నగరాల్లో కోవిద్ కేసులు విపరీతంగా పెరుగుతున్నప్పటికీ, ఐపీఎల్ మ్యాచులు నిర్వహించేందుకు హైదరాబాద్ సేఫ్‌ అని నమ్మకం పోవడం చాలా ఆశ్చర్యానికి గురి చేసింది...
undefined
ఇలాగే కొనసాగితే లోకల్ ప్లేయర్లు లేకపోవడం వల్ల సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి అభిమానుల మద్దతు క్షీణిస్తుంది... కొన్ని విజయాలతో ఎస్‌ఆర్‌హెచ్ ఈ సీజన్‌ను ముగిస్తుంది...
undefined
ఇప్పటికైనా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆత్మపరిశీలన చేసుకోవాలి...’ అంటూ ట్వీట్ చేశాడు సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్ మీర్జా...
undefined
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మహ్మద్ అజారుద్దీన్ కూడా ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచ్‌ల నిర్వహణకు హైదరాబాద్‌ నగరం బాగుంటుందని సూచించాడు.
undefined
అయితే ఐపీఎల్ వేదికలను షార్ట్ లిస్ట్ చేసే సమయంలో హైదరాబాద్ నగరంలో మ్యాచుల నిర్వహణ కష్టం అంటూ అజారుద్దీన్ వ్యాఖ్యానించినట్టు, అందుకే హైదరాబాద్ పేరును తొలగించినట్టు టాక్...
undefined
click me!