విరాట్ కోహ్లీ ఇచ్చిన ఆ సలహా వల్లే నెం.1 ర్యాంకు సాధించా... పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్...

First Published Apr 15, 2021, 5:48 PM IST

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో దాదాపు 1300 రోజులుగా టాప్‌లో కొనసాగుతున్న విరాట్ కోహ్లీకి ఎట్టకేలకు చెక్ పెట్టాడు పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్. సఫారీలతో జరిగిన వన్డే సిరీస్‌లో అద్భుతంగా రాణించి, నెం.1 వన్డే బ్యాట్స్‌మెన్‌గా అవతరించాడు. అయితే తన సక్సెస్ క్రెడిట్‌ మొత్తం విరాట్‌కే దక్కుతుందని అంటున్నాడు బాబర్ ఆజమ్...

సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో ఓ సెంచరీతో పాటు 94, 31 పరుగులతో రాణించి నెం.1 వన్డే బ్యాట్స్‌మెన్‌గా టాప్ ర్యాంకుకి ఎగబాకాడు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్...
undefined
మరోవైపు ఇంగ్లాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో మొదటి రెండు మ్యాచుల్లో హాఫ్ సెంచరీలు చేసినా... మూడో మ్యాచ్‌లో సింగిల్ డిజిట్‌కే అవుటైన విరాట్ కోహ్లీ, 1300 రోజుల తర్వాత వన్డేల్లో రెండో ర్యాంకుకి పడిపోయాడు...
undefined
‘నేను ఐసీసీ నెం.1 బ్యాట్స్‌మెన్‌గా మారడానికి విరాట్ కోహ్లీ ఇచ్చిన అమూల్యమైన సలహాయే కారణం.. మిగిలిన బ్యాట్స్‌మెన్‌లాగే, నేను కూడా ప్రాక్టీస్ సెషన్స్‌ను చాలా లైట్ తీసుకునేవాడిని...
undefined
టీమిండియాతో జరిగిన ఓ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీని తనలా స్టార్ బ్యాట్స్‌మెన్‌గా ఎదగాలంటే ఏం చేయాలని అడిగాను... నెట్ సెషన్స్‌ను కూడా మ్యాచ్‌లాగే భావించాలని విరాట్ కోహ్లీ సూచించాడు...
undefined
ప్రాక్టీస్‌లో మనం ఆడే షాట్స్, మ్యాచ్‌లో షాట్లు ఆడే విధానాన్ని డిసైడ్ చేస్తాయి. ప్రాక్టీస్‌లో నిర్లక్ష్యంగా షాట్స్ ఆడితే, మ్యాచ్‌లోనూ అదే రిపీట్ అవుతుంది... అంటూ విరాట్ కోహ్లీ ఇచ్చిన సలహా నాకు ఎంతగానో ఉపయోగపడింది...
undefined
నెట్స్‌లో ఎక్కువ సమయం గడపడం అలవాటు చేసుకున్నా. ప్రాక్టీస్‌లో సంతృప్తి కలగకపోతే, బ్యాట్స్‌మెన్‌గా నాకు సాటిఫ్యాక్షన్ వచ్చేదాకా నెట్స్‌లో గడపడం మొదలెట్టా...
undefined
రిజల్ట్ మీరు చూస్తున్నారుగా... వన్డేల్లో నెం.1 బ్యాట్స్‌మెన్ అయినంత మాత్రాన నేను గొప్ప బ్యాట్స్‌మెన్‌నని గర్వపడాల్సిన అవసరం లేదు. ఈ పొజిషన్‌ను కాపాడుకోవడం చాలా కష్టం...
undefined
వన్డే, టీ20ల్లో రాణిస్తున్నా టెస్టుల్లో నెం.1 బ్యాట్స్‌మెన్‌గా ఎదగాలనేది నా కోరిక’ అంటూ చెప్పుకొచ్చాడు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్...
undefined
వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌ను అధిరోహించిన నాలుగో పాక్ క్రికెటర్‌గా నిలిచాడు బాబర్ ఆజమ్. అలాగే 18 ఏళ్ల తర్వాత ఈ ఫీట్ సాధించిన తొలి పాక్ ప్లేయర్ కూడా అతనే...
undefined
ఇంతకుముందు జహీర్ అబ్బాస్, జావెద్ మియాందాద్, మహ్మద్ యూసఫ్ మాత్రం వన్డేల్లో పాక్ నుంచి నెం.1 వన్డే బ్యాట్స్‌మెన్‌గా నిలిచారు...
undefined
click me!