కోహ్లీతో కెప్టెన్సీ పోటీ లేదు... అతనెప్పుడూ నాకు కెప్టెనే... అజింకా రహానే క్లారిటీ...

First Published Jan 25, 2021, 1:03 PM IST

ఓటమి ఎరుగని భారత జట్టు కెప్టెన్‌గా దూసుకుపోతున్నాడు అజింకా రహానే. కెప్టెన్‌గా ఐదు టెస్టులు ఆడిన రహానే... నాలుగు విజయాలను అందించాడు. ఓ టెస్టు డ్రాగా ముగిసింది. దీంతో రహానేకి టెస్టు కెప్టెన్సీ అప్పగించాలని చర్చ నడుస్తోంది. అయితే అజింకా మాత్రం కోహ్లీతో కెప్టెన్సీ పోటీ లేదంటున్నాడు...

ఆస్ట్రేలియా టూర్‌కి ముందు కెప్టెన్‌గా భారత జట్టుకి రెండు విజయాలను అందించాడు అజింకా రహానే... అయితే ఈ రెండూ స్వదేశంలో వచ్చాయి.
undefined
ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాను ఓడించే సత్తా అజింకా రహానేకి లేదని ఆసీస్ మాజీ క్రికెటర్లు విమర్శించారు... అయితే వాటికి తన కెప్టెన్సీతోనే సమాధానం చెప్పాడు రహానే...
undefined
విరాట్ కోహ్లీ లేని భారత జట్టును ఆస్ట్రేలియా 4-0 తేడాతో క్లీన్ స్వీప్ చేస్తుందని ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అండ్ కో... కానీ కుర్రాళ్లతో నిండిన రహానే టీమ్, ఆస్ట్రేలియాలో అద్భుతమై చేసింది...
undefined
మూడు టెస్టుల్లో రెండు విజయాలు, ఓ డ్రా అందించిన రహానేకి టెస్టు కెప్టెన్సీ అప్పగించాలని, ఇలా చేయడం వల్ల విరాట్ కోహ్లీపై ఒత్తిడి తగ్గి, బ్యాట్స్‌మెన్‌గా ఎక్కువకాలం కొనసాగడానికి అవకాశం దొరుకుతుందని మాజీ క్రికెటర్ బిషన్ సింగ్ బేడీ వ్యాఖ్యానించాడు.
undefined
అయితే ఈ వ్యాఖ్యలను కొట్టిపారేశాడు భారత తాత్కాలిక కెప్టెన్, టెస్టు వైస్ కెప్టెన్ అజింకా రహానే...
undefined
‘నాకు, విరాట్ కోహ్లీ మధ్య టెస్టు కెప్టెన్సీ గురించి పోటీ ఏ మాత్రం లేదు.. విరాట్ కోహ్లీ నా కెప్టెన్... కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు భారత జట్టు గెలవాలనే ఉద్దేశంతో వ్యూహాలు రచిస్తాడు...
undefined
నేను కెప్టెన్‌గా మారినప్పుడు విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఏం చేసేవాడో అదే చేస్తాను... ’ అని చెప్పుకొచ్చాడు అజింకా రహనే...
undefined
కామ్ అండ్ క్యూట్ యాటిట్యూడ్‌తో ఆస్ట్రేలియాను ఓడించిన అజింకా రహానే టీమ్... 32 ఏళ్ల తర్వాత గబ్బాలో ఆసీస్‌కు ఓటమి రుచి చూపించింది..
undefined
click me!