ఆసియా కప్ రిజల్ట్ చూసి కూడా తీరు మార్చుకోని సెలక్టర్లు... ఆ ఇద్దరితో టీమిండియా సీన్ మారుతుందా...

Published : Sep 12, 2022, 06:25 PM IST

ఆసియా కప్ 2022 టోర్నీలో సూపర్ 4 రౌండ్ నుంచే నిష్కమించింది భారత జట్టు. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలో దిగిన టీమిండియా, పాకిస్తాన్, శ్రీలంక చేతుల్లో ఓడిన విధానం సగటు క్రికెట్ ఫ్యాన్‌ని తీవ్ర ఆవేదనకి గురి చేసింది. ఈ రిజల్ట్‌తో టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ఎంపిక చేసే జట్టులో సంచలన మార్పులు ఉంటాయని భావించారు క్రికెట్ ఫ్యాన్స్...

PREV
110
ఆసియా కప్ రిజల్ట్ చూసి కూడా తీరు మార్చుకోని సెలక్టర్లు... ఆ ఇద్దరితో టీమిండియా సీన్ మారుతుందా...

టీ20 ఫార్మాట్‌లో కుదురుకోవడానికి తెగ ఇబ్బంది పడుతున్న రిషబ్ పంత్‌ని మరో కీలక టోర్నీకి ఎంపిక చేయకపోవచ్చని అనుకున్నారు క్రికెట్ ఫ్యాన్స్. రిషబ్ పంత్‌ని మళ్లీ ఆడించడం కంటే, అతని స్థానంలో సంజూ శాంసన్‌కి అవకాశం ఇస్తే బాగుంటుందని డిమాండ్ వినిపించారు...

210
Image credit: PTI

అయితే అభిమానుల డిమాండ్‌ని పట్టించుకోని సెలక్టర్లు, రిషబ్ పంత్‌కి మరో అవకాశం ఇచ్చేందుకే మొగ్గు చూపారు. టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ ఆడిన రిషబ్ పంత్, ఆస్ట్రేలియాలో భారత జట్టుకి ప్రధాన వికెట్ కీపర్‌గా బాధ్యతలు నిర్వహించబోతున్నాడు...

310
Image credit: PTI

ఊహించినట్టుగానే స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గాయం కారణంగా టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి దూరమయ్యాడు. జడ్డూ ప్లేస్‌లో అక్షర్ పటేల్‌ని ఆల్‌రౌండర్‌గా ఎంచుకున్నారు సెలక్టర్లు. అయితే అభిమానులు మాత్రం జడేజా స్థానంలో రాహుల్ తెవాటియాకి అవకాశం దక్కి ఉంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు...

410

మొదటి రెండు మ్యాచుల్లో విఫలమై, జ్వరం వంకతో ఆసియా కప్‌కి దూరమైన ఆవేశ్ ఖాన్, టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. అతని స్థానంలో జస్ప్రిత్ బుమ్రా, హర్షల్ పటేల్... భారత జట్టులోకి తిరిగి వచ్చారు. ఆసియా కప్ 2022 టోర్నీకి, టీ20 వరల్డ్ కప్ టోర్నీకి ఎంపిక చేసిన జట్లలో ప్రధానమైన తేడాలు ఇవే...

510
Shikhar Dhawan

బ్యాటింగ్ ఆర్డర్‌లో ఎలాంటి మార్పులు చేయడానికి సాహసించని బీసీసీఐ, ఐసీసీ టోర్నీల్లో అద్భుతమైన రికార్డు ఉన్న శిఖర్ ధావన్‌ని తిరిగి టీ20లకు ఎంపిక చేయడానికి సుముఖంగా లేనట్టే ఉంది. అలాగే మహ్మద్ షమీని రిజర్వు ప్లేయర్‌గా ఎంచుకున్న సెలక్టర్లు, సిరాజ్‌ని పూర్తిగా పక్కనబెట్టేశారు...

610
Image credit: Getty

ఆస్ట్రేలియా టూర్ 2020-21 టోర్నీలో భారత జట్టు తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు మహ్మద్ సిరాజ్. 3 టెస్టుల్లో 14 వికెట్లు తీసిన సిరాజ్, బ్రిస్బేన్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టాడు. ఈ సిరీస్ పర్ఫామెన్స్ ఆధారంగా రిషబ్ పంత్‌కి మరో అవకాశం ఇవ్వాలనుకున్న సెలక్టర్లు, సిరాజ్‌వైపు చూడకపోవడం విశేషం...

710
Image credit: Getty

టీ20 వరల్డ్ కప్ 2021, ఆసియా కప్ 2022 టోర్నీలకు ఎంపికైన రవిచంద్రన్ అశ్విన్‌కి పొట్టి ప్రపంచకప్ 2022 టోర్నీలోనూ చోటు దక్కింది. అశ్విన్‌ని టీమిండియా ఎలా వాడాలనుకుంటోంది? అనే విషయం మాత్రం క్రికెట్ ఎక్స్‌పర్ట్స్‌కి అర్థం కావడం లేదు. కనీసం టీమిండియాకైనా ఈ విషయంలో క్లారిటీ ఉందా? అని అనుమానిస్తున్నారు అభిమానులు...

810
Image credit: PTI

ఆసియా కప్ 2022 టోర్నీలో విఫలమైనా ఆఫ్ఘాన్‌తో మ్యాచ్‌లో 3 వికెట్లు తీశాడనే కారణంగా టీ20 వరల్డ్ కప్ 2022 జట్టులో చోటు దక్కించుకున్నాడు యజ్వేంద్ర చాహాల్. ఒకే మ్యాచ్‌ ఆడి మంచి పర్ఫామెన్స్ ఇచ్చిన కుర్రాడు రవి భిష్ణోయ్ మాత్రం స్టాండ్ బై ప్లేయర్‌గా మిగిలాడు...

910

శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో 3 హాఫ్ సెంచరీలు బాది 204 పరుగులు చేసి ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ గెలిచిన శ్రేయాస్ అయ్యర్ కూడా మరోసారి స్టాండ్ బై ప్లేయర్‌గానే మిగిలాడు. సూర్యకుమార్ యాదవ్‌తో పాటు దీపక్ హుడాపైనే బోలెడు ఆశలు పెట్టుకుంది భారత జట్టు...

1010
Image credit: PTI

మొత్తానికి ఆసియా కప్ 2022 టోర్నీకి ఎంపిక చేసిన జట్టుకి జస్ప్రిత్ బుమ్రా, హర్షల్ పటేల్‌లను కలిపి రవీంద్ర జడేజా, ఆవేశ్ ఖాన్‌లను తొలగించారు సెలక్టర్లు. ఇంతకుముందు సంచలన నిర్ణయాలు లేవు, కొత్త ముఖాలు లేవు... అని నిరాశ వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.. 

click me!

Recommended Stories