అమ్మో ఉమ్రాన్ మాలిక్ ఆ! అతన్ని ఆడడం కష్టమే కానీ... సౌతాఫ్రికా కెప్టెన్ తెంబ భవుమా కామెంట్స్...

Published : May 31, 2022, 05:06 PM IST

ఫాస్ట్ బౌలింగ్ ప్రపంచంలో దక్షిణాఫ్రికా బౌలర్లకు కూడా అగ్రస్థానం ఉంటుంది. సఫారీ టీమ్ నుంచి డేల్ స్టెయిన్, కగిసో రబాడా, ఎన్తీనీ, ఫిలందర్, ఆన్రీచ్ నోకియా వంటి ఎందరో ఫాస్ట్ బౌలర్లు వచ్చారు. మార్కో జాన్సెన్ వంటి యంగ్ స్టర్లు వస్తున్నారు. అయితే ఓ భారత యంగ్ పేసర్‌ని ఎదుర్కోవడానికి భయపడుతున్నానంటూ సౌతాఫ్రికా కెప్టెన్ తెంబ భవుమా ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు...   

PREV
17
అమ్మో ఉమ్రాన్ మాలిక్ ఆ! అతన్ని ఆడడం కష్టమే కానీ... సౌతాఫ్రికా కెప్టెన్ తెంబ భవుమా కామెంట్స్...

ఐపీఎల్ 2022 సీజన్‌లో 150 కి.మీ.ల వేగంతో బంతులు వేసి టాక్ ఆఫ్ ది సీజన్‌గా మారిన ఉమ్రాన్ మాలిక్, 14 మ్యాచుల్లో ‘ఫాస్టెస్ట్ డెలివరీ ఆఫ్ ది మ్యాచ్’ల కింద రూ.14 లక్షలు ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే...

27

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 157 కి.మీ.ల వేగంతో బౌలింగ్ చేసి అందరి అటెన్షన్ కొట్టేసిన ఉమ్రాన్ మాలిక్, ఐపీఎల్ 2022 సీజన్ పర్ఫామెన్స్ కారణంగా భారత జట్టులో చోటు కూడా దక్కించుకున్నాడు...

37

ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున 14 మ్యాచుల్లో 22 వికెట్లు తీసిన ఉమ్రాన్ మాలిక్, ఆరెంజ్ ఆర్మీ తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు... సౌతాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌కి ప్రకటించిన జట్టులో మాలిక్‌కి చోటు దక్కింది.

47

‘ఉమ్రాన్ మాలిక్, భారత జట్టులో ఓ అద్భుతం. అతను ఐపీఎల్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చి, టీమ్‌లోకి వస్తున్నాడు. కచ్ఛితంగా అతనిపై భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను అందుకోవడానికి ఉమ్రాన్ మాలిక్ కష్టపడతాడు కూడా...

57

సౌతాఫ్రికాలో మేం ఫాస్ట్ బౌలింగ్‌ను ఎదుర్కోంటూనే పెరుగుతాం. అయితే ఏ బ్యాటర్ కూడా 150 కి.మీ.ల వేగంతో వచ్చే బంతులను ఫేస్ చేయడానికి ఇష్టపడడు. కాబట్టి మేం అతన్ని ఎదుర్కోవడానికి మరింత సిద్ధంగా ఉండాలి...

67

టీమిండియాకి ఉమ్రాన్ మాలిక్ చాలా స్పెషల్ టాలెంట్ అవుతాడు. అతను ఐపీఎల్‌లో అదరగొట్టినట్టే అంతర్జాతీయ స్థాయిలోనూ అద్భుతంగా రాణించాలని నేను కోరుకుంటున్నా...’ అంటూ కామెంట్ చేశాడు సౌతాఫ్రికా వైట్ బాల్ కెప్టెన్ తెంబ భవుమా...

77

ఈ ఏడాది ప్రారంభంలో సౌతాఫ్రికా టూర్‌లో మొదటి టెస్టు గెలిచినా ఆ తర్వాత రెండు టెస్టులు, మూడు వన్డేల్లో చిత్తుగా ఓడిన భారత జట్టు, స్వదేశంలో ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది... జూన్ 9 నుంచి ప్రారంభమయ్యే ఇండియా, సౌతాఫ్రికా టీ20 సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రిత్ బుమ్రా వంటి సీనియర్లు పాల్గొనడం లేదు.. సౌతాఫ్రికాలో వన్డే సిరీస్‌లో క్లీన్ స్వీప్ అయిన కెఎల్ రాహుల్ కెప్టెన్సీలోనే స్వదేశంలో టీ20 సిరీస్ ఆడనుంది టీమిండియా... 

click me!

Recommended Stories