ఐపీఎల్ 2022 సీజన్‌లో 10 మ్యాచుల్లో ఓడి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచి,ఘోర పరాభవాన్ని మూటకట్టుకుంది ముంబై ఇండియన్స్. ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్... ఈ విధంగా చిత్తుగా ఓడుతుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు...
ఐపీఎల్ 2022 సీజన్‌ని వరుసగా 8 ఓటములతో ప్రారంభించిన ముంబై ఇండియన్స్, ఆ తర్వాత 6 మ్యాచుల్లో 4 గెలిచినా... 10 పరాజయాలతో పదో స్థానంలో సెటిల్ కావాల్సి వచ్చింది.. అయితే ఓడినా ఈ సీజన్‌లో తాము చాలా కొత్త విషయాలు నేర్చుకున్నామని అంటున్నాడు ముంబై సారథి రోహిత్ శర్మ...
28
‘ఈ సీజన్ అస్సలు ఊహించని విధంగా సాగింది. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనూ మేం చాలా విషయాలు నేర్చుకోగలిగాం, కొన్ని పాజిటివ్ విషయాలను తీసుకోగలిగాం...
38
క్లిష్ట పరిస్థితుల్లో ఓ జట్టుగా కలిసి ఉండడం అనేది చాలా పెద్ద విషయం. అది ఈ సీజన్‌లో మేం తెలుసుకున్నాం. ఇప్పుడు మా ఫోకస్ అంతా వచ్చే సీజన్‌పైనే ఉంది...
48
ఈ సీజన్ చివర్లో మంచి విజయాలు అందుకున్నాం. ఈ విజయాలు మా పరిస్థితిని మార్చలేకపోవచ్చు కానీ మాకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. మేం వచ్చే సీజన్‌లో మరింత బలంగా రావడానికి కావాల్సిన ఉత్సాహాన్నిచ్చాయి...
58
టీమ్‌లో సమిష్టితత్వం నిండుగా ఉంది. ఏ జట్టుకైనా ఇది చాలా అవసరం. ఏ పరిస్థితుల్లోనూ ఓటమిని అంగీకరించడానికి జట్టు సిద్ధంగా లేదు. మేం ఓ కుటుంబంలా కలిసి ఉన్నాం. ట్రైయినింగ్‌లో మేం బెస్ట్ ఇచ్చాం...
68
మా అందరి లక్ష్యం ఒక్కటే, దాని కోసం కలిసి పని చేస్తాం. ఈ సీజన్‌లో కొందరు గన్ ప్లేయర్లలో కనుగొన్నాం. వాళ్లు ఫ్యూచర్‌లో స్టార్లు అవుతారు. ఈ సీజన్‌లో వాళ్ల పర్పామెన్స్ చూసి చాలా గర్వంగా ఫీల్ అయ్యాం...
78
Dewald Brevis
ఇంత చిన్న వయసులోనే మెంటల్‌గా ఎంతో స్ట్రాంగ్‌గా ఉంటూ, పరుగులు చేయాలనే ఆకలిని తీర్చుకుంటున్నారు... ఈ సీజన్‌లో ముంబై ఆడిన వాళ్లలో చాలా మంది కొత్తవాళ్లే, మొట్టమొదటిసారి ఐపీఎల్ ఆడుతున్నవాళ్లే.
88
అయితే వాళ్లకి కావాల్సిన స్వేచ్ఛ, సపోర్ట్ ఇచ్చాం. వాళ్ల పర్ఫామెన్స్ సంతృప్తినిచ్చింది. భవిష్యత్తు అద్భుతంగా ఉండబోతుందన్న భరోసా ఇచ్చింది...’ అంటూ చెప్పుకొచ్చాడు ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ...